పార్టీ నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో ఏది పడితే అది మాట్లాడొద్దని సూచించారు. కవిత అరెస్ట్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించి కాదు... వ్యక్తిగతమైన ఇష్యూ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కవిత అరెస్ట్ గురించి ప్రెస్ మీట్ లు పెట్టొద్దని ఆదేశించారు.
ప్రణీత్ రావు కేసులో ట్విస్ట్.. బయటపడ్డ ఫోన్ ఛాటింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణీత్ రావ్ ఫోన్ చాటింగ్ చిత్రాలు ఎన్ టివి చేతికి చిక్కాయి. ఎన్నికల ముందు ప్రణీతరావు కొంతమంది వ్యక్తుల ఫోన్లు టాప్ చేసినట్లు చాటింగ్ లో వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతో ప్రణీత్ రావు టాపింగ్ కు పాల్పడ్డాడు. బీఆర్ఎస్ నేత…
Kishan Reddy: సికింద్రాబాద్లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ ను వర్చువల్ గా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు.
Amith Shah: మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు బేగంపేట్ ఎయిర్ పోర్టు వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేపు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో.. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ‘కోహినూర్’ వజ్రం గురించిన కథ కూడా ఉంటుంది. తెలంగాణ భూముల్లోనే కోహినూర్ వజ్రం లభించిన సంగతి…
మార్చి 14 నుండి మార్చి 17 వరకు కేంద్ర సాంస్కృతిక శాఖ, గైడ్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యం లో గ్లోబల్ స్పిరుచువాలిటీ మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసుధైక కుటుంబం థీమ్ తో మహోత్సవమని, కన్హా శాంతి వనం లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 15 న రాష్ట్రపతి ప్రారంభిస్తారని, మార్చి 16 న ఉప రాష్ట్రపతి పాల్గొంటారని ఆయన…
ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ముందుకు కదిలింది. ఇటీవల బడ్జెట్లో రూ.900ల కోట్లు కేటాయించిన కేంద్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచే క్లాస్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 337 ఎకరాల భూమిని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమి చుట్టూ ట్రెంచ్ కొట్టించింది.
వేయి స్తంభాల గుడిలో పునర్నిర్మాణం చేసిన కళ్యాణమండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి ఉదయమే చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడిలో కిషన్ రెడ్డి పూజలు చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల కోసం బీజేపీ వివిధ కమిటీలు వేసింది. ఆ కమిటీలు చేసిన, చేయాల్సిన పనులపై కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలకు కిషన్ రెడ్డి సూచనలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ఉచిత వైద్య సదుపాయాలు పొందుతున్నారు.. పథకాల అమలు అర్ధం కాకపోతే ఆర్టీఐ ద్వారా వివరాలు తెలుసుకోవాలి అని సూచించారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై కావాలనే బురద జల్లుతున్నారు అని ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి వెల్లడించారు.