ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజలు పాటు తెలంగాణలో పర్యటిస్తున్నారు. నేడు రెండో రోజు సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోడీ. అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే.. ఈ భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దామన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని బండకేసి కొడితే…
హైదరాబాద్ నగరంలోని తార్నాకలోని CSIR - IICT లో సైన్స్ సిటీ సెంటర్ కు సైన్స్ & టెక్నాలజీ మంత్రి డాక్టర్. జితేంద్ర సింగ్ తో కలిసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
విజయ సంకల్ప యాత్ర రోడ్ షో సందర్బంగా వారసిగూడాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని, ఈ దేశంలో అవీనితిరహిత, శాంతి భద్రతలు బడుగు బలహీనులకు సంక్షేమ పాలనకు అందించే విధంగా తొమ్మిదిన్నర ఏళ్ళుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందన్నారు. ఈ దేశం కోసం, పిల్లల భవిష్యత్, పేదల ప్రజల సంక్షేమం కోసం ఓటు వేసే విధంగా ప్రజలను చైతన్యం చేయడానికే…
బస్తీవాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. లకిడీకపూల్, ఆసిఫ్ నగర్, కుమ్మరివాడి, మెహదీపట్నం జిభాబాగ్ లో పవర్ బోర్ లను ప్రారంభించారు. హోటల్ నీలోఫర్ టీ తాగిన కేంద్రమంత్రి ,.. కుండల తయారీనీ పరిశీలించిన కిషన్ రెడ్డి.. లకిడీకపూల్, ఆసిఫ్ నగర్ నీలోఫర్ హోటల్ ముందు పవర్ బోర్ ను ప్రారంభించారు. అనంతరం స్థానిక నరసింహ స్వామి టెంపుల్ లో…
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విజయ సంకల్ప యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో జమ్మూకాశ్మీర్లో 43 వేల మంది భద్రతా బలగాలు బలయ్యారని తెలిపారు. పాకిస్తాన్ ఈ రోజు ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మిగిలిందని అన్నారు. నేడు దేశంలో సమర్ధవంతమైన నాయకత్వం ఉందని.. ఈ రోజు పాకిస్తాన్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. మన సైనికుల్ని చంపిన ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే…
గోషామహల్ జుమ్మారత్ బజార్ లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 5 విజయ సంకల్ఫ యాత్రలు జరుగుతున్నాయని, కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది నుండి, మరోటి వికారాబాద్ జిల్లా తాండూర్ నుండి, 3వది సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో బాసర నుండి, 5 వది భద్రాచలం రాముల వారి చెంత నుండి యాత్రలు ప్రారంభమైందన్నారు. మార్చీ 2 యాత్రలు ముగుస్తాయని ఆయన పేర్కొన్నారు.…
హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి బుపెంద్ర భాయ్ పాటిల్ కి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏప్రిల్ మొదటి వారం లో ఎన్నికలు జరుగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరైతే దేశాన్ని ముందుకు తీసుకుపోతుందో.. ఎవరి నేతృత్వంలో అవినీతి రహిత దేశం ఏర్పడుతుందో ఆలోచించి ఓటు వేయాలని ప్రజల్ని కోరుతున్నానన్నారు.
వీర్ సావర్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కాచిగూడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. అనంతరం విజయ సంకల్ప యాత్రకు బయలుదేరారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం సందర్భంగా పద్మారావు నగర్ స్వరాజ్య ప్రెస్ చేరుకున్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వీర తిలకం దిద్ది విజయం కాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన పద్మారావు నగర్,…
బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే సనత్ నగర్, ఎర్రగడ్డ మీదుగా నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అమీట్ పేట్ లో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో మళ్లీ మోదీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రంలో 5 యాత్రలను ప్రారంభించడం జరిగిందని, ఈ రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా…