Kishan Reddy : నమ్మిన సిద్ధాంతం కోసం వాజపేయి ఎక్కడ రాజీ పడలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాజపేయి విదేశాంగ మంత్రి అయ్యేవరకు.. పాస్ పోర్ట్ రావాలంటే రెండు మూడేళ్లు పట్టేదన్నారు. ఐక్యరాజ్య సభలో హిందీలో మాట్లాడిన తొలి భారత ప్రభుత్వ ప్రతినిధి వాజపేయి అని ఆయన వ్యాఖ్యానించారు. విదేశాల్లో భారత దేశాన్ని కించ పరిచే విధంగా అవహేళన చేసే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, రాజ్యాంగ బద్ధ సంస్థలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా విదేశాలకు వెళ్ళిన వాజ్ పేయ్.. దేశ ప్రతిష్టను పెంచే విధంగా మాట్లాడారని, ఈనాటి ప్రతిపక్ష నాయకుడికి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడికి ఎంత తేడా ఉందో చూడండన్నారు. ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని తృణ ప్రాయంగా వదిలేసి ప్రజల మధ్యకు వెళ్ళారని, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు వాజపేయి చేశారన్నారు కిషన్ రెడ్డి. స్వర్ణ చతుర్భుజి పేరుతో 75 వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు ప్రారంభించారన్నారు.
Delhi: పార్లమెంటు సమీపంలో.. ఒంటికి నిప్పంటించుకున్న వ్యక్తి.. పరిస్థితి విషమం!
అంతేకాకుండా..’అన్ని జిల్లా కేంద్రాలను జాతీయ రహదారులకు అటాచ్ చేసే విధంగా నేడు ప్రధాని మోడీ పనిచేస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు వ్యవస్థను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి వాజపేయి. వాల్మీకి అంబేద్కర్ అవాస్ యోజన పథకం.. హైద్రాబాద్ లోనే ప్రారంభించారు. కేసీఆర్ ఒక్క ఇంటికి కూడా భూమి పూజ చేయలేదు. వాజపేయి బహిరంగ సభలకు వాహనాలు పెట్టకపోయినా.. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేవారు.. వాజపేయి స్ఫూర్తితో ప్రధాని మోడీ పనిచేస్తున్నారు.. లక్షమంది యువకులను రాజకీయ నాయకులుగా తయారు చేయాలని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఏడాది పాటు వచ్చే డిసెంబర్ 25 వరకు వాజ్ పాయ్ శత జయంతి వేడుకలు కొనసాగుతాయి.. వాజపేయి వ్యక్తిత్వాన్ని ఈ తరానికి తెలియజేసేవిధంగా పనిచేద్దాం’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Health: నల్ల జీలకర్ర గురించి లాభాలు తెలుసా..? ఈ సమస్య ఉన్న వారు వాడండి