తాజాగా విడుదలైన ‘LYF – Love Your Father’ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. తండ్రి-కొడుకుల మధ్య అనుబంధాన్ని భావోద్వేగపూరితంగా చిత్రీకరించిన ఈ ట్రైలర్, ఒక్కసారిగా సినిమా పట్ల ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ చిత్రంలో ఎస్పీ చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పవన్ కేతరాజు దర్శకత్వంలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.
Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేసినా తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ, ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారని ఆయన వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు.…
ఆర్థిక వనరుల సమీకరణ పేరిట రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(పి) లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ అంశపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపాలని పేర్కొన్నారు.
అక్రమ సంబంధం అనుమానం.. ప్రియుడిపై 20సార్లు కత్తిపోట్లు ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ప్రియుడిని 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు భర్త. కాగా.. రెండ్రోజుల తర్వాత ఈ హత్య ఉదంతం బయట పడింది. వివరాల్లోకి వెళ్తే.. భర్త కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ క్రమంలోనే తన భార్యతో ప్రియుడు మనోజ్‌కు ఫోన్ చేయించాడు. అయితే…
Kishan Reddy : ఇవాళ చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీని వ్యతిరేకించే పక్షాలు- కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. అసలు నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కానే కాలేదు, నియమ నిబంధనలు రూపొందించనే లేదు, కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ ఈ…
తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ ఆగ్ని ప్రమాదం.. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి ఒకటి, రెండు యూనిట్ల కూలింగ్ రూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో గదిలోని విద్యుత్ తీగలు కాలిపోయి ధ్వంసమయ్యాయి. అలర్ట్ అయిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు18 కు పైగా ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఫైర్ సిబ్బంది…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్న ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు నాకు తెలియదు అన్నాడని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నో సభల్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అప్పులపై మాట్లాడిన వీడియోలు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడని పేర్కొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత రెండు నెలలుగా తమిళనాడు ముఖ్యమంత్రి వితండ వాదం చేస్తున్నాడని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో మాకు అన్యాయం చేయడానికి మోదీ కుట్ర పన్నాడు అని మాట్లాడుతున్నారు.. అది పూర్తిగా రాజకీయపరమైన విమర్శ అని పేర్కొన్నారు.
తమిళనాడులో త్రిభాషా వివాదం రగులుకుంటోంది. రాష్ట్ర బడ్జెట్ లోగో నుంచి రూపాయి చిహ్నాన్ని స్టాలిన్ ప్రభుత్వం తొలగించింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్రిభాషా పాలసీ కొత్తది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటీ నుంచి ఈ విధానం కొనసాగుతుందని అన్నారు. నచ్చిన భాషలో చదువుకోవచ్చు. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని చెప్పారు. Also Read:Tirupati Stampede:…