Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
- సూపర్ ఎల్ నినోపై అప్రమత్తం కావాలి..
- రైతులకు అవగాహన కల్పించాలన్న పవన్ కల్యాణ్..
- సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష..
- ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ ఎల్ నినో ప్రభావం, సాగునీటి పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాగునీటి పరిస్థితులు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను పవన్ కు వివరించారు. రైతులు ఆందోళన చెందకుండా వాస్తవ పరిస్థితులను తెలియజేయడంతో పాటు సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని పవన్ సూచించారు.
సూపర్ ఎల్ నినో ప్రభావంపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు డిప్యూటీ సీఎం ఆదేశించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ చర్యలు, సాగునీటి లభ్యతపై స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు. అలాగే ప్రతి రైతు ప్రధాని ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా చేయించుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రస్తుతం ప్రతి నీటి బొట్టు విలువైనదేనని, నీటి వృథాను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాలువల్లో పూడిక తొలగింపు, గట్ల లీకేజీల మరమ్మతులు చేపట్టి నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రత్యామ్నాయ చర్యలు అమలు చేయాలని సూచించారు.
Also Read
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
ఇదే సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏలేరు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి నిమ్మల రామానాయుడు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను పరిశీలించిన మంత్రి, పరిస్థితులను పవన్‌కు వివరించారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, సాగునీటి నిర్వహణలో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!