Cricket Legends: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. ఈ ఐదుగురు స్పిన్నర్ల రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Top 5 Greatest First-Class Cricket Bowlers: క్రికెట్ అంటే ఎక్కువగా బ్యాటర్లు, వాళ్లు చేసే స్కోర్లపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ.. క్రికెట్ చరిత్ర కేవలం బ్యాటర్ల సిక్సర్లు, ఫోర్ల రికార్డులతో మాత్రమే నిర్మితమవ్వలేదు. మంచి స్పిన్, అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన బౌలర్లే ఈ చరిత్రకు అసలైన పునాది వేశారు. ఫస్ట్-క్లాస్ క్రికెట్ చరిత్రను ఒకసారి తిరగేస్తే.. బౌలింగ్ నిర్వచనాన్నే మార్చేసి, దశాబ్దాల పాటు మైదానాన్ని ఏలిన ఐదుగురు దిగ్గజ బౌలర్లు మనకు కనిపిస్తారు. ఈ ఐదుగురిలో మొదట వినిపించే పేరు విల్ఫ్రెడ్ రోడ్స్ (Wilfred Rhodes). 1898 నుంచి 1930 వరకు దాదాపు 32 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన తన కెరీర్లో రోడ్స్ తిరుగులేని రికార్డులను నెలకొల్పారు. ఏకంగా 1,110 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 1,85,742 బంతులు వేసి, 16.72 సగటుతో 4,204 వికెట్లు పడగొట్టారు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయన నెలకొల్పిన ఈ మైలురాయిని అందుకోవడం ఆధునిక క్రికెట్లో దాదాపు అసాధ్యం.
ఆ తర్వాతి స్థానంలో ఎ.పి. ఫ్రీమాన్ (AP Freeman) నిలుస్తారు. 1914 నుంచి 1936 మధ్య కాలంలో కేవలం 592 మ్యాచ్‌ల్లోనే 3,776 వికెట్లు సాధించి తన అద్భుత బౌలింగ్ సామర్థ్యాన్ని చాటారు. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన ఘనత (10/53) కూడా సాధించిన ఫ్రీమాన్, 18.42 సగటుతో ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే వికెట్ల వేటగాడిగా నిలిచారు. ఈ జాబితాలో మరో లెజెండ్ సి.డబ్ల్యూ.ఎల్. పార్కర్ (CWL Parker). 1903 నుంచి 1935 మధ్య 635 మ్యాచ్‌లు ఆడిన పార్కర్ తన స్పిన్ మాయాజాలంతో 3,278 వికెట్లు నేలకూల్చారు. ఒకే ఇన్నింగ్స్‌లో 10/79 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. 19.46 సగటుతో ఎంతటి బలమైన బ్యాటింగ్ లైనప్‌నైనా కూల్చేసేవారు.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
ఇక క్రికెట్ ప్రారంభ రోజుల్లో బౌలింగ్‌కు సరికొత్త ప్రమాణాలు నిర్దేశించిన దిగ్గజం జె.టి. హియర్న్ (JT Hearne). 1888 నుంచి 1923 మధ్య 639 మ్యాచ్‌లు ఆడి 17.75 అత్యుత్తమ సగటుతో 3,061 వికెట్లు తీశారు. ఒకే ఇన్నింగ్స్‌లో 9/32 అత్యుత్తమ ప్రదర్శన చేసిన హియర్న్, ఆ యుగంలో అత్యంత పొదుపైన బౌలర్‌గా పేరుగాంచారు. చివరగా, 1922 నుంచి 1952 మధ్య తన అద్భుత స్పెల్స్‌తో చెరగని ముద్ర వేసిన టి.డబ్ల్యూ.జె. గాడార్డ్ (TWJ Goddard) 593 మ్యాచ్‌ల్లో 2,979 వికెట్లు పడగొట్టారు. ఒకే ఇన్నింగ్స్‌లో 10/113 అద్భుత ప్రదర్శన ఇచ్చి, 19.84 సగటుతో కెప్టెన్లు నమ్మే మ్యాచ్ విన్నర్‌గా నిలిచారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..