బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 1200 స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా.. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్‌లో 14 స్టేషన్లను కేంద్రం రీ డెవలప్మెంట్ చేస్తుంది. ఈ క్రమంలో.. రూ.27 కోట్లతో బేగంపేట్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేశారు.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ను ఓడించి, ఆయనను సీఎం పదవి నుంచి తొలగించిందీ తానేనని రేవంత్ స్పష్టం చేశారు. ఇక ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పూర్తిగా ఓటమి దక్కిందంటే, దానికి కారణం తానేనని కేటీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. “స్టేటస్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు.…
Hyderabad: పెద్ద టోర్నీల్లో భారత్ (Team India) విజయం సాధిస్తే దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడం మాములే. ఇందులో భాగంగానే తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. దీనితో 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని మళ్లీ భారత జట్టు ముద్దాడింది. ఈ సందర్బాన్ని దేశవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు జాతీయ జట్టు విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. భారత్…
ఆర్ఆర్ఆర్ అంచనా వ్యయం రూ.18,772 కోట్లు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.. రూ.300 కోట్లతో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లేన్ల నేషనల్ హైవే పూర్తి చేస్తామని వెల్లడించారు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లేవారికి సిగ్నల్ ఫ్రీ రోడ్ అవుతుందన్నారు.. పార్లమెంట్ సమావేశాల తర్వాత నితిన్ గడ్కరీ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. కాంగ్రెస్ గురుంచి తాను మాట్లాడ దాల్చుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయం లో వాళ్ళ కన్నా ఎక్కువ మాకు ఉందని స్పష్టం చేశారు.…
అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని.. ధైర్యంగా సవాళ్లను ఎదురుకొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆది నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదని.. మహిళల అభివృద్ధికి, రక్షణకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. భూగర్భం ఖనిజాల వెలికితీత నుంచి వినీలాకాశంలో ఫైలట్ వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అన్ని…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళను శక్తిగా కొలిచే సంప్రదాయం ఒక్క భారత్‌లోనే ఉందని అన్నారు. ఇంటిని నడిపే మాతృమూర్తి మహిళ అని పొగిడారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇచ్చిన అద్భుతంగా మహిళా మోర్చా నేతలు పని చేస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి అఖండ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఈ విజయం తెలంగాణ సమాజానికి, ఉపాధ్యాయులకు అంకితం ఇస్తున్నాం. రెండు ఎమ్మెల్సీలు ఏక కాలంలో రావడం చాలా సంతోషం. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని ఆదరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన…
Kishan Reddy: తెలంగాణలో భారతీయ జనతా పార్టీది తిరుగులేని విజయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పట్టభద్రులు ప్రభుత్వానికి , రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు అని తెలిపారు.
కేంద్రం ఇస్తోంది.. కానీ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని రేవంత్ అంటున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.. ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "తెలంగాణకు మోడీ 7 జవహర్ నవోదయ విద్యాలయాలు ఇచ్చారు. నా పార్లమెంట్ పరిధిలో జగిత్యాల, నిజామాబాద్ లో ఒకటి చొప్పున రెండు వచ్చాయి. పార్టీలకతీతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాను.
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి, కేసీఆర్‌తో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు.