కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ నీ పరామర్శించేందుకు నేడు అల్లు అర్జున్ కిమ్స్ కి రానున్నారు.ఇప్పటికే పలుమార్లు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వస్తున్నట్లుగా చెప్పి చివరి నిమిషంలో డ్రాప్ అయిన అల్లు అర్జున్ పోలీసుల అనుమతితో కిమ్స్ ఆసుపత్రికి రానున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ కొన ఊపిరితో కిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.గత 35 రోజులుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. శ్రీ తేజ తల్లి రేవతి ఇప్పటికే మరణించడంతో తండ్రి భాస్కర్ శ్రీ తేజని చూసుకుంటున్నారు.
Also Read : Mokshagna : నందమూరి మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదట
కొద్దిసేపటి క్రితం కిమ్స్ ఆసుపత్రికి బయలుదేరాడు అల్లు అర్జున్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోనున్న అల్లు అర్జున్. చనిపోయిన రేవతి భర్తను పరామర్శించనున్న అల్లు అర్జున్. అల్లుఅర్జున్ రాక సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు పోలీసులు. అల్లు అర్జున్ కు ఎస్కార్ట్ వాహనం ఇచ్చి పంపారు పోలీసులు. ఇప్పటికే పుష్ప నిర్మాతలు మైత్రి మూవీస్, హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి రెండు కోట్ల రూపాయల చెక్ శ్రీ తేజ తండ్రి కి అందజేశారు. అలాగే అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్, రవి పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా శ్రీ తేజ నీ పరామర్శించారు. ఇవాళ అల్లు అర్జున్ కిమ్స్ కి రానుండటంతో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించనున్నారు.