పుష్ప -2 రిలీజ్ రోజు న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. శ్రీ తేజ్ పరామర్శించి శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీశారు అల్లు అర్జున్. అలాగే తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఓదార్చాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత FDC ఛైర్మెన్ దిల్ రాజు కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి బాలుడ్ని పరామర్శించారు.
Also Read : AlluArjun : కిమ్స్ కు బయలుదేరిన అల్లు అర్జున్
పోలీసుల అనుమతితో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించాడు. బన్నీ రాకతో కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు పోలీసులు. అల్లు అర్జున్ కు ఎస్కార్ట్ వాహనం తో సెక్యూరిటీ ఇచ్చారు పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ్ కొన ఊపిరితో కిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గత 35 రోజులుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. శ్రీ తేజ తల్లి రేవతి ఇప్పటికే మరణించడంతో తండ్రి భాస్కర్ శ్రీ తేజని చూసుకుంటున్నారు. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపాడు అల్లు అర్జున్. ఇప్పటికే పుష్ప నిర్మాతలు మైత్రి మూవీస్, హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి రెండు కోట్ల రూపాయల చెక్ శ్రీ తేజ తండ్రి కి అందజేశారు. పరామర్శ అనంతరం కిమ్స్ ఆసుపత్రి నుండి వెళ్లిపోయాడు అల్లు అర్జున్.