Kim Jong: చైనాలోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన ఉత్తర కొరియా నేత కిమ్
- చైనాలోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు
- ట్రైన్‌లో ప్రయాణం చేసి బీజింగ్ చేరుకున్న కిమ్ జోంగ్ ఉన్
- సైనిక కవాతులో పాల్గొననున్న కిమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో రెండు రోజుల పాటు షాంఘై సహకార సదస్సు జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మెడీ.. ఇలా ఆయా దేశాధినేతలంతా హాజరయ్యారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో చైనాలో అడుగుపెట్టారు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు మాత్రం తాజాగా వెరైటీగా అడుగుపెట్టారు. బీజింగ్‌లో జరిగే సైనిక కవాతులో పాల్గొనేందుకు బుల్లెట్ ప్రూఫ్ రైల్లో వచ్చారు. విదేశీ పర్యటనలు అంటే చాలా హడావుడి.. హంగామా ఉంటుంది. అందుకు భిన్నంగా కిమ్ జోంగ్ ఉన్ మాత్రం రైల్లో చైనాకు వచ్చారు. మంగళవారం బీజింగ్‌లో జరిగే సైనిక కవాతులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి పాల్గొననున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సందర్భంగా 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీజింగ్‌లో సైనిక కవాతు జరుగుతోంది. ఈ కవాతును జిన్‌పింగ్, కిమ్ కలిసి వీక్షించనున్నారు.
ఇది కూడా చదవండి: US-Russia: రష్యాపై తీవ్ర ఆంక్షలకు అమెరికా రంగం సిద్ధం.. ట్రెజరీ కార్యదర్శి సంకేతాలు
Also Read
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధంలో కూడా సహకరించారు. ఉత్తర కొరియా సైన్యాన్ని రష్యాకు పంపించారు. ఇక పుతిన్ కూడా నిన్న చైనాలో పర్యటించారు. జిన్‌పింగ్‌తో కలివిడిగా తిరిగారు. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ కూడా వచ్చారు. దీంతో ఈ బంధం మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. చెల్లిని ప్రేమించాడని ఓ అన్నయ్య ఘాతుకం.. ప్రియుడిని బయటకు తీసుకెళ్లి..!
చైనా సైనిక కవాతులో పాల్గొనేందుకు సోమవారం ప్యోంగ్యాంగ్ నుంచి కిమ్ జోంగ్ రైల్లో బయల్దేరారు. విదేశాంగ మంత్రి చో సోన్-హుయ్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి రైల్లో ప్రయాణించారు. రెండేళ్ల క్రితం రష్యాలో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి కూడా కిమ్ రైల్లోనే వెళ్లారు. అలాగే హనోయ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్‌ను కలిసేందుకు వియత్నాంకు 60 గంటలు ప్రయాణం చేశారు. ఇక 2018లో సింగపూర్‌లో తొలిసారి ట్రంప్‌ను కలిసేందుకు చైనా అందించిన బోయింగ్ 747 విమానంలో కిమ్ వెళ్లారు.
అమెరికా, దాని మిత్ర దేశాలు.. ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలపర్చుకునేందుకు రష్యా, చైనాతో కిమ్ సంబంధాలు పెంచుకుంటున్నారు. అంతేకాకుండా ఉత్తర కొరియాకు తొలి నుంచి రష్యా, చైనా సంపూర్ణ మద్దతు ఇస్తూనే ఉన్నాయి. ఇక ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత రష్యాకు కిమ్ బాగా దగ్గరయ్యారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేసిందని అమెరికా, దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!