Aung San Suu Kyi: మయన్మార్‌లో తాజాగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆ దేశ అగ్ర నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ గురించి ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె కుమారుడు కిమ్ అరిస్ మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలుగా తన తల్లి గురించి తనకు ఏ వార్తలు అందలేదని అన్నారు. “గత రెండు సంవత్సరాలుగా ఆమెను ఎవరూ చూడలేదు. కుటుంబ సభ్యులను, న్యాయవాదిని కూడా కలుసుకోనిలేదు. కాబట్టి ఆమె ఇంకా బతికే ఉందో లేదో కూడా…