బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య, పెండెం దొరబాబు.... అందరూ అందరే. అంతా సీనియర్ లీడర్సే. కొందరు రాష్ట్ర స్థాయిలో, కొందరు నియోజకవర్గంలో చక్రాలు తిప్పేసిన వారే. అంతకు ముందు వైసీపీలో ఉన్నప్పుడు వాయిస్ రెయిజ్ చేసిన వారే. కానీ... కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి.... సదరు లీడర్స్ స్వరాలు మూగబోయాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫుల్ వాల్యూమ్‌లో ఫ్యాన్ కిందినుంచి పక్కకు వచ్చేసి టీ గ్లాస్ పట్టుకున్నారు ఈ నేతలంతా.
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
ఈ రోజు జనసేన పార్టీలో కీలక నేతలు చేరబోతున్నారు.. సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదబభాను, కిలారి రోశయ్య కూడా ఈ రోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు..
Kilari Rosaiah: ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో రోశయ్య, ఉదయ భాను సమావేశం అయ్యారు.
వైసీపీ అధినేత,సిఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని గుంటూరు వైసీపీ పార్లమెంటు అభ్యర్థి కిలారు రోశయ్య పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు, నవ సమాజ స్థాపనకు మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నారని అన్నారు.