ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్ల ఆక్రమణ తరువాత ఆ దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాలిబన్లను చూసుకొని ఇతర ఉగ్రవాద సంస్థలు రెచ్చిపోతున్నాయి. రష్యా, పాక్, చైనా మినహా మిగతా దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసేసిన సంగతి తెలిసిందే. తాలిబన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించకపోవడంతో ఆ దేశం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో పేదలకు సరైన ఆహారం దొరకడం లేదు. ఈ సమస్య నుంచి ఆఫ్ఘనిస్తాన్ బయటపడాలి అంటే…
ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే దేశంలో టీకాలు అందిస్తూ వస్తున్నారు. కాగా, చిన్నారులకు సంబంధించి టీకాలపై భారత్ బయోటెక్ సంస్థ ట్రయల్స్‌ను నిర్వహించింది. కోవాగ్జిన్ టీకాల ట్రయల్స్ పూర్తికావడంతో డేటాను ఇప్పటికే కేంద్రం ఆరోగ్య శాఖకు అందజేసింది. కాగా కేంద్రం ఈ వ్యాక్సిన్‌కు అనుమతులు మంజూరు చేసింది. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ప్యానల్ అనుమతులు ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లోనే విపణిలోకి వచ్చే అవకాశం ఉన్నది. డ్రగ్స్ రెగ్యులేటరీ అనుమతి ఇవ్వాల్సి ఉన్నది. డ్రగ్స్ రెగ్యులేటరీ…
మలేరియా… ప్రతి ఏడాది ఈ వ్యాధి కారణంగా లక్షలాది మంది చిన్నారులు మృతి చెందుతున్నారు. ఈ మలేరియా జ్వరానికి ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి లేకపోవడంతో ఇలా మరణాలు సంభవిస్తున్నాయి. కాగా, తాజాగా, ప్రపంచ ఆరోగ్యసంస్థ పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబ్ల్యూటీఎస్ ఆర్టీఎస్ పేరుతో తయారు చేసిన వ్యాక్సిన్‌ను ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌ను 5 నెలలు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ అందించ వచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది.…
ప్రేమలు వరకు ఓకే అదే ప్రేమ పెళ్లి వరకు వచ్చే సరికి అనేక అడ్డంకులు ఎదురౌతుంటాయి. ప్రేమ పెళ్లిళ్ల తరువాత ఎన్ని కష్టాలు ఎదురవుతాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో తల్లిదండ్రుల మద్దతు ఉంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నవారి జీవితం హ్యాపీగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే, ప్రేమ పెళ్లిళ్లకు ఎంత మంది పేరెంట్స్ అనుకూలంగా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ట్రూలీమ్యాడ్లీ అనే డేటింగ్ యాప్ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో హైదరాబాద్ తల్లులు తమ…
అక్కినేని కోడలు సమంత వారసుల కోసం నటనకు గ్యాప్ తీసుకుంటుందా!? అంటే అవునని చెప్పక తప్పదు. ప్రస్తుతం సమంత వయసు 34 సంవత్సరాలు. గత 11 సంవత్సరాలుగా విరామం ఎరుగక పని చేస్తూనే ఉంది సమంత. 2017లో పెళ్ళైన తర్వాత కూడా గ్యాప్ తీసుకోలేదు. ఇంకా ఎక్కువ బిజీ అయింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న తారల్లో సమంత ముందు వరుసలోనే ఉంటుంది. ఇక ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్’ 2 తో డిజిటల్…
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు. డెల్టా, డెల్టాప్లస్ వేరియంట్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్‌లో 60 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువగా కరోనా సోకగా, సెకండ్ వేవ్‌లో మధ్యవయస్కులు ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. కాగా, గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ నగరాల్లో చిన్నారులకు కరోనా సోకుతుండటంతో థర్డ్ వేవ్ మొదలైందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే మిజోరాం రాష్ట్రం రాజధాని ఐజ్వాల్‌లో చిన్నారులు…
దేశవ్యాప్తంగా 18 ఏళ్లు వయసుపైబడిన వారికి కరోనా టీకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య తక్కువగా నమోదవ్వడానికి ఇదికూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లలోపున్న పిల్లలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే నెలలోనే టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈరోజు బీజేపీ ఎంపీలతో పీఎం మోడీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్…
దేశంలో ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటలో ఉన్నాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు 18 ఏళ్లు పైబడిన వారికి అందించేవే. మూడో వేవ్ ప్రమాదం ముంచి ఉందని, చిన్నపిల్లలకు సోకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో చిన్నారులకు అందించే వ్యాక్సిన్‌పై దృష్టిపెట్టారు. భారత్ బయోటెక్ సంస్థ చిన్నారుల కోసం కోవాగ్జిన్ ను తయారు చేస్తున్నది. 2 నుంచి 18 ఏళ్ల వారిపై వ్యాక్సిన్‌ను ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే 6-12 ఏళ్ల వయసువారికి సెకండ్ డోస్…
అక్రమ సంతానం విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ ప్రపంచంలో అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమోగాని, అక్రమ సంతానం ఉండదని పేర్కొన్నది. తమ పుట్టుకలో పిల్లల పాత్ర ఏమీ ఉండదని కోర్టు పేర్కొన్నది. బెంగళూరు ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ బెస్కాంలో గ్రెడ్ 2 లైన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి మరణించడంతో ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆయన రెండో భార్య కుమారుడు బెస్కాంకు విజ్ఞప్తి చేయగా, బెస్కాం తిరస్కరించింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి…