అక్కినేని కోడలు సమంత వారసుల కోసం నటనకు గ్యాప్ తీసుకుంటుందా!? అంటే అవునని చెప్పక తప్పదు. ప్రస్తుతం సమంత వయసు 34 సంవత్సరాలు. గత 11 సంవత్సరాలుగా విరామం ఎరుగక పని చేస్తూనే ఉంది సమంత. 2017లో పెళ్ళైన తర్వాత కూడా గ్యాప్ తీసుకోలేదు. ఇంకా ఎక్కువ బిజీ అయింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న తారల్లో సమంత ముందు వరుసలోనే ఉంటుంది. ఇక ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్’ 2 తో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఆమె సాధించిన విజయం మామూలుది కాదు. నటిగా తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ అన్ని మాధ్యమాల్లో క్రేజ్ ను విస్తరించుకుంటూ వచ్చింది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’లో శకుంతలగా టైటిల్ పాత్ర పోషిస్తున్న సమంత ఆ షూటింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం ‘కాతు వాకుల రెండుకాదల్’ సినిమా షూట్‌లో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ సమంత నటనకు కొంత కాలం విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుందట. ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత గత కొంత కాలంగా విశ్రాంతిని కోరుకుంటోంది. అందుకేనేమో ఆమె ఏ కొత్త సినిమాలకు సంతకం చేయలేదు. అంతే కాదు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ని వివాదంపైనా స్పందించింది. ఈ వెబ్ సిరీస్‌లో రాజీ పాత్రలో జీవించిన సమంత… ఆ పాత్ర చిత్రీకరణ పట్ల బాధపడిన వారికి క్షమాపణలు చెప్పింది. వయసు మీద పడుతుండటంతో పాటు, పెళ్ళి అయి నాలుగు సంవత్సరాలు దాటుతుండటంతో అభిమానులు అందరూ పిల్లల గురించి ప్రశ్నిస్తుండటం…. అక్కినేని వంశాభిమానులు వారసుల గురించి ఆరాటపడుతుండటంతో కెరీర్ లో గ్యాప్ తీసుకుని ఆ పనిమీద ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి నాగచైతన్య, సమంత ఎంత త్వరగా అభిమానుల కోరిక తీరుస్తారో చూడాలి.