మలేరియా… ప్రతి ఏడాది ఈ వ్యాధి కారణంగా లక్షలాది మంది చిన్నారులు మృతి చెందుతున్నారు. ఈ మలేరియా జ్వరానికి ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి లేకపోవడంతో ఇలా మరణాలు సంభవిస్తున్నాయి. కాగా, తాజాగా, ప్రపంచ ఆరోగ్యసంస్థ పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబ్ల్యూటీఎస్ ఆర్టీఎస్ పేరుతో తయారు చేసిన వ్యాక్సిన్‌ను ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌ను 5 నెలలు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ అందించ వచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది. పిల్లలకు నాలుగు డోసుల్లో ఈ వ్యాక్సిన్‌ను అందిస్తారు. ఇప్పటికే ఆఫ్రికాలోని మూడు దేశాల్లో 2.5 మిలియన్ డోసుల టీకాలు అందించారు. ఈ టీకాలు సురక్షితమైనవని, 25 దేశాల్లో మొదట మలేరియా నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది. ఆఫ్రికా దేశాల్లో ప్రతి ఏడాది 2.65 లక్షల మంది చిన్నారులు మలేరియాతో మృతి చెందుతున్నారు.
Read: సరికొత్త ట్రెండ్: పాముకాటుతో హత్యలు…