తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఆచూకీ భీమవరంలో లభ్యం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్ధినిని కిడ్నాపర్ భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వుంచాడని తేలింది. కిడ్నాపర్‌ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి స్నాప్ చాట్ ద్వారా పరిచయం అయ్యాడు భీమవరం మండలం కొత్త పూసలుమర్రుకి చెందిన ఫణీంద్ర. లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని యువతిని నమ్మించాడు ఫణీంద్ర. ఆమెను భీమవరం బలుసుమూడి లో ఒక రూమ్ లో నిర్బంధించాడు.…