కొరియన్ కార్ల తయారీ సంస్థ ‘ కియా ’ ఇండియాలో అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. ఎన్నడూ లేని విధంగా ఏడాది తొలి అర్థభాగంతో పాటు జూన్ నెలలో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను నమోదు చేసిందని కియా ఇండియా ప్రకటించింది. జూన్ నెలలో ఏకంగా 24,024 యూనిట్ల కార్లను విక్రయించింది. 2021లో ఇదే నెలలో 15,015 కార్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే దాదాపుగా 10 వేల యూనిట్లను అదనంగా విక్రయించింది. దాదాపు 60 శాతం గ్రోత్ నమోదు చేసింది. కియా…