Kia Carens Clavis EV: కియా మోటార్స్ తన తాజా ఎలక్ట్రిక్ కార్ అయిన Kia Carens Clavis EV ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కారును రూ. 17.99 లక్షల (ఎక్స్-షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. Kia Carens Clavis EV వినియోగదారుల అవసరాల ప్రకారం నాలుగు విభిన్న వేరియంట్లలో లాంచ్ అయ్యింది. ప్రతి వేరియంట్‌లో ఫీచర్లకు తగ్గట్టుగా ధర కూడా అనుగుణంగా పెరుగుతుంది. Carens Clavis EV 42 kWh,…
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం కావడం కలకలం రేపుతోంది.. కియా పరిశ్రమలో రోజుకి వందల కార్లు ఉత్పత్తి అవుతుంటాయి.. ఈ కియా కార్లు తయారు చేసే ప్రధాన పరిశ్రమకు విడిభాగాలు, పరికరాలు 25 కియా అనుబంధ పరిశ్రమల నుంచి వస్తాయి.. అయితే, దాదాపు 900 కియా కార్ల ఇంజిన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించింది..
దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు కియా ద్వారా అనేక అద్భుతమైన వాహనాలు భారత మార్కెట్లో విక్రయించబడుతున్న సంగతి తెలిసిందే.. కాగా.. ఇటీవల ఇండియాలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూనే కంపెనీ మరో కొత్త వాహనాన్ని విడుదల చేసింది. అదే కియా సిరోస్ ఎస్‌యూవీ.. కియా మోటార్స్ జనవరి 3 నుంచి తన పోర్ట్‌ఫోలియోలో సరికొత్త సిరోస్ ఎస్‌యూవీ బుకింగ్‌ను ప్రారంభించనుంది. అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి దీని బుకింగ్ ప్రారంభం కానుంది.
రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నారు ప్రజలు. ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ భారత విపణిలోకి ప్రవేశించాయి. టూ వీలర్స్ మాత్రమే కాకుండా ఎలక్రిక్ కార్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. దేశీయంగా మోటార్స్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న టాటా ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే.. కొత్త కొత్త మోడల్స్‌తో…
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ సంస్థ ఇండియాలోని అనంతపురం జిల్లాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్ నుంచి కియా కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. కియా కార్లు ఇండియాలో ఫేమస్ కావడంతో కియా మోటార్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలో కియా మోటార్స్ సంస్థ పేరును మార్చుకుంది. కియా మోటార్స్ ను కియా ఇండియాగా మార్చింది. లోగోలో కూడా ఈ మార్పులు చేసింది. ఇండియాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ల వద్ద కూడా క్రమపద్దతిలో…
కరోనా నివారణ చర్యల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుంది.. ప్రభుత్వాలకు ఇది భారంగా కూడా మారుతోంది.. అయితే, కరోనా కట్టడి చర్యలకు సాయం అందించడానికి మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నాయి పలు సంస్థలు.. తాజాగా, కియా మోటార్స్ తన వంతు సాయం ప్రకటించింది. ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి రూ. 5 కోట్లు ఎన్ఈఎఫ్‌టీ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసిన పత్రాలను అందజేశారు కియా ప్రతినిధులు. ఈ నిధులను…