Massive theft at Kia Motors: అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియాలో భారీ దొంగతనం జరిగింది.. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం కావడం కలకలం రేపుతోంది.. కియా పరిశ్రమలో రోజుకి వందల కార్లు ఉత్పత్తి అవుతుంటాయి.. ఈ కియా కార్లు తయారు చేసే ప్రధాన పరిశ్రమకు విడిభాగాలు, పరికరాలు 25 కియా అనుబంధ పరిశ్రమల నుంచి వస్తాయి.. అయితే, దాదాపు 900 కియా కార్ల ఇంజిన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించింది.. దీనిపై మార్చి 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు..
Read Also: Dilsukhnagar Bomb Blast: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
అయితే, Andhra Pradesh, Massive theft, Kia factory, Penukonda, Sri Sathya Sai district, car engines, Kia Motors, Massive theft at Kia Motors:
గతంలో కియా పరిశ్రమలో పనిచేసి వెళ్లిన ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు.. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు తరలించే సమయంలో మార్గ మధ్యంలో ఏమైనా చోరీ జరిగిందా? అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు పోలీసులు.. ఏదేమైనా.. అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం కావడం తీవ్ర కలకలం రేగుతోంది.. అంతర్జాతీయ కార్ల సంస్థ కావడంతో.. సెక్యూరిటీ కూడా ఆదే స్థాయిలో ఉంటుంది.. కానీ, సెక్యూరిటీ కళ్లు గప్పి.. అన్ని ఇంజిన్లు ఎలా మాయం చేశారు అనేది ఇప్పుడు సంచలనంగా మారిపోయింది..