Kia Carens Clavis EV: కియా మోటార్స్ తన తాజా ఎలక్ట్రిక్ కార్ అయిన Kia Carens Clavis EV ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కారును రూ. 17.99 లక్షల (ఎక్స్-షోరూం) ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. Kia Carens Clavis EV వినియోగదారుల అవసరాల ప్రకారం నాలుగు విభిన్న వేరియంట్లలో లాంచ్ అయ్యింది. ప్రతి వేరియంట్‌లో ఫీచర్లకు తగ్గట్టుగా ధర కూడా అనుగుణంగా పెరుగుతుంది. Carens Clavis EV 42 kWh, 51.4 kWh రెండు బ్యాటరీ వేరియంట్లలో వస్తుంది. ఇందులో 42 kWh బ్యాటరీ వేరియంట్ 404 కిమీ రేంజ్‌ను అందిస్తుందని కియా తెలిపింది. అదే విధంగా 51.4 kWh పెద్ద బ్యాటరీ 490 కిమీ వరకు రేంజ్ వస్తుందని తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో HTK+, HTX, HTX ER, HTX+ ER అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఏ మోడల్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందామా..
Kia Carens Clavis EV HTK+:
ఇది బేస్ వేరియంట్. ఇందులో 16 అంగుళాల హై గ్లోస్సీ అరో అలాయ్ వీల్స్, Ice Cube LED హెడ్ ల్యాంప్స్, స్టార్ మ్యాప్ డిజైన్ DRLs, టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే ఇందులో స్మార్ట్ కీ, మోషన్ సెన్సర్, రిమోట్ స్టార్ట్, ఆటోమేటిక్ AC, రియర్ వైపర్, 25 లీటర్ల ఫ్రంట్ బూట్ (Frunk), ఫ్లోటింగ్ కన్‌సోల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. 26.62 అంగుళాల డ్యూయల్ ప్యానొరామిక్ డిస్‌ప్లే, Paddle షిఫ్టర్లు, i-Pedal, Regen బ్రేకింగ్ సపోర్ట్, డ్రైవ్ మోడ్ సెలెక్ట్ (Eco/Normal/Sport), సెమి-లెథర్ సీట్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, స్మార్ట్ పురే ఎయిర్ ప్యూరీఫైర్, షిఫ్ట్-బై-వైర్ గేర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ వెరియంట్ ధరను రూ.17.99 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు.
Read Also:Ramayapatnam Port: రామాయపట్నం పోర్టుపై సర్కార్ ఫోకస్.. ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ

Kia Carens Clavis EV HTX:
HTK+ వేరియంట్ నెక్స్ట్ వేరియంట్, HTX వేరియంట్‌లో మరికొన్ని ఫీచర్లను పొందుపరిచారు. ఇందులో 64 కలర్ అంబియంట్ లైటింగ్, ఫుట్ వెల్ ల్యాంప్స్, బీజ్ అండ్ నేవీ లెదరెట్టు సీట్స్, డ్యూయల్ పేన్ ప్యానొరామిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. ఈ వేరియంట్ లో ADAS Level 2 ఫీచర్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ చార్జింగ్, సీట్బ్యాక్ టేబుల్, కప్ హోల్డర్, IT హోల్డర్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. Kia Connectతో ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిరర్, పవర్ స్టీరింగ్ విత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్ వంటి సౌకర్యాలు ఇందులో లభిస్తాయి. ఈ వెరియంట్ ధరను రూ.20.49 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు.

Kia Carens Clavis EV HTX ER:
ఇది HTX వేరియంట్‌కి ఎక్స్‌టెండెడ్ రేంజ్ (ER) వేరియంట్. HTXలోని అన్ని ఫీచర్లతో పాటు.. అన్ని విండోలకూ ఆటో అప్ అండ్ డౌన్ సపోర్ట్ ఉంటుంది. వీటితోపాటు వాయిస్ రికగ్నిషన్‌తో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, అప్‌గ్రేడెడ్ స్టీరింగ్ వీల్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఈ వెరియంట్ ధరను రూ.22.49 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు.
Read Also:Harry Potter Reboot: హ్యారీ పోట్టర్ రీబూట్ ప్రారంభం.. కొత్త హ్యారీగా ఎవరంటే..?

Kia Carens Clavis EV HTX+ ER:
ఈ టాప్-ఎండ్ వేరియంట్ ను ప్రీమియంగా డిజైన్ చేసింది కియా. ఇందులో 17 అంగుళాల డ్యూయల్ టోన్ అరో అలాయ్ వీల్స్, BOSE 8 స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, వెహికల్ టు లోడ్ (V2L) ఫీచర్ ఉన్నాయి. వీటితోపాటు ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, 4-వే పవర్ డ్రైవర్ సీటు, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి అధునాతన సౌకర్యాలే కాక.. రియర్ డోర్‌లో కియా లోగో ప్రొజెక్షన్ కూడా ఉంటుంది. వాక్-ఇన్ లెవర్, ప్రీమియం అంబియెంట్ లైటింగ్, Paddle షిఫ్టర్స్, రీజెన్ బ్రేకింగ్, స్మార్ట్ పురే ఎయిర్ ప్యూరీఫైర్ వంటి టాప్ ఫీచర్లు ఈ వేరియంట్‌ను మరింత స్పెషల్‌గా చేశాయి. ఈ వెరియంట్ ధరను రూ.24.49 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు.