Kia Car: కియా మోటార్స్ తన తాజా మోడల్ కారెన్స్ కార్లను వినియోగదారుల నుంచి రీకాల్ చేస్తోంది. తాజా మోడల్‌లో సాఫ్ట్‌వేర్ సమస్యలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన కంపెనీ 44,174 కార్లను వెనక్కి పిలిపిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది. కియా ఇండియా ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను తనిఖీ చేయడానికి, లోపాలు ఉంటే సరిచేయడానికి తన తాజా మోడల్ ‘కారెన్స్’ కార్లను వెనక్కి రప్పించింది.
కియా ఇండియా బాధ్యతాయుతమైన కార్పొరేట్ కంపెనీగా తనిఖీకి వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. అవసరమైతే, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఉచితంగా అందిస్తామని కియా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్వచ్ఛంద రీకాల్ క్యాంపెయిన్ గురించి అప్‌డేట్ చేయడానికి సంబంధిత వాహనాల యజమానులను నేరుగా చేరుకుంటామని కియా తెలిపింది. ఇప్పటికే కియా కారెన్స్ కార్లు కొన్న యజమానులను కంపెనీ సంప్రదిస్తుంది. ఈ రీకాల్ క్యాంపెయిన్ గురించి వారికి వివరిస్తుంది. వారి వాహనాలను వెనక్కి తీసుకొని అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేస్తుంది. మీరు కియా కారెన్స్ కార్ కొన్నట్టైతే మీ డీలర్‌ను సంప్రదించి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కియా ఇండియా కారెన్స్ మోడల్ కార్లను విడుదల చేసింది. ఇది ఆరు, ఏడు సీటింగ్ ఆప్షన్లతో వస్తుంది.
Read Also: Diwali Crackers: టపాసుల దుకాణాలకు కొత్త రూల్స్.. అది తప్పనిసరి
కియా కారెన్స్ ప్రారంభ ధర రూ.8.99 లక్షలు. హైఎండ్ స్పెసిఫికేషన్స్ ఉన్న కార్ ధర రూ.16.99 లక్షలు. ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ పేర్లతో ఐదు వేరియంట్స్‌లో లభిస్తుంది. గ్లేసియర్ వైట్ పెరల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే, అరోర బ్లాక్ పెరల్, ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, స్పార్క్లింగ్ సిల్వర్, ఇంటెన్స్ రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. కార్ లవర్స్‌ని ఈ వాహనం ఎంతగానో ఆకట్టుకుంది. కంపెనీ ధర ప్రకటించకముందే 19,000 బుకింగ్స్ వచ్చాయి. ధర ప్రకటించిన తర్వాత కూడా కియా కారెన్స్ బుకింగ్స్ జోరుగా సాగాయి. రూ.10,00,000 లోపే ఈ కారును రిలీజ్ చేసింది కంపెనీ.
Read Also:Flipkart: రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్
ఈ కారు 1.5 పెట్రోల్, 1.4 లీటర్ పెట్రోల్, 1.5 డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో లభిస్తుంది. కియా కారెన్స్ ఈ ఏడాది జనవరి 14న ప్రారంభించిన బుకింగ్ ద్వారా రెండు నెలల్లోనే 50,000 బుకింగ్స్ నమోదు చేసింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ 42 శాతం బుకింగ్స్ టైర్ 3, ఇతర నగరాల నుండి వచ్చాయని తెలిపింది.