అతనో తహశీల్దార్..అయితేనేం డ్యాన్సర్ లకు ధీటుగా డ్యాన్స్ వేస్తూ అలరించారు. నూతన సంవత్సరం వేడుకల్లో రచ్చరంబోలా చేశారు. చిరంజీవి స్టెప్పులతో డ్యాన్స్ తో గోలీమార్ అంటూ అందరినీ అలరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తాహశీల్దార్. ఖమ్మం జిల్లా కల్లూరు మండల రెవెన్యూ అధికారిగా మంగీలాల్ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రెవిన్యూ పరిధిలో పనులతో బిజీగా గడిపే తహశీల్దార్ నూతన సంవత్సర వేడుకల్లో తనదైన స్టైల్ లో డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు.
మంగీలాల్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా లోని బలపాలపల్లి గ్రామం. అక్కడ జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో స్నేహితులతో కలిసి డ్యాన్స్ వేసి అలరించారు. చిరంజీవి స్టెప్పులతో అచ్చం ప్రొఫెషనల్ డ్యాన్సర్ లా తహశీల్దార్ మంగీలాల్ డ్యాన్స్ వేశారు. ఆ వీడియో స్థానిక వాట్సప్ గ్రూప్ లలో వైరల్ గా మారింది. తాహశీల్దార్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది.