పద్మశ్రీ రామయ్య చెట్లకు నీళ్లు పోయడానికి రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని ప్రమాదానికి గురయ్యాడు . ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి కి చెందిన వనజీవి రామయ్యకు ఉదయం లేచిన వద్ద నుంచి నీళ్లు పోయడం చెట్ల పొదల్లో తుపాలను తొలగించడం, ఎర్రచందనం, చింత చెట్ల గింజలను ఏరుకుని వాటిని మళ్ళీ నాటడం అలవాటు. ఎనిమిది పదుల వయసులో కూడా పద్మశ్రీ రామయ్య తాను నాటిన చెట్లను జాగ్రత్త గా చూసుకోవడం అలవాటుగా మారింది. అదేవిధంగా ఇవాళ ఉదయం కూడా పద్మశ్రీ రామయ్య తన ఇంటి సమీపంలోనిచెట్ల వద్దకు వెళ్తుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. దీంతో పద్మశ్రీ రామయ్యకు కాలు విరిగింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇలాంటి ఘటనే.. May 17, 2022 జగిత్యాల, జోగులాంబగద్వాల జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. జగిత్యాల జిల్లో లోని బైపాస్ రోడ్ లో రాత్రి ఎదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలు ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇక నిన్నటి (May 17, 2022) రోజే జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కోదండపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కోదండ పూర్ దగ్గర వారు ప్రయాణిస్తున్న ఆటోను…. హైదరాబాద్ నుంచి జమ్మలమడుగు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఆటో ఎగిరి కిందపడగా… కారు బోల్తా కొట్టింది.ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం వేళ ఆటోలో 9 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ఎన్ని పకడ్భందీ చర్యలు చేపట్టినా ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. కొందరు అతివేగంతో ప్రాణాల మీదకు తెచ్చకుంటున్నారు. అతివేగం ప్రాణాంతకం అంటూ బోడ్డులు చదవడానికే తప్పా ఆచరించడానికి పనికి రాకుండా పోయాయు. దీంతో ఎక్కడ చూసిన ప్రమాదాలు చోటు చేసుకుంటూనే వున్నాయని కొందరు స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
CBI: కార్తీ చిదంబరానికి షాక్.. అనుచరుడి అరెస్ట్..