భారీ వర్షాలు సింగరేణి పాలిట శాపంగా మారాయి. ఏడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం సింగరేణి అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోడెం ఓసి లో వారం రోజుల క్రితం భారీగా చేరింది వరద నీరు. చెరువును తలపిస్తున్న కోయగూడెం ఓ సి గని నుంచి నీటిని తోడడం అంత ఆషామాషీ కాదు. ఓసి గనులలోకి వస్తున్న వరద నీటిని గమనించ లేదు అధికారులు. ప్రయివేట్ మోటార్ల తో వరద నీటిని బయటికి పంపేందుకు పనులు ముమ్మరం చేశారు అధికారులు.
వర్షాల కారణంగా వారం రోజులుగా నిలిచిపోయింది 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి. 280 వేల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు ఆటంకం కలుగుతోంది. సింగరేణికి కోట్ల ఆదాయం నష్టం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సింగరేణికి కోట్ల నష్టం వాటిల్లింది. ఇల్లందు ఏరియా సింగరేణి కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా కోల్ బెంచ్ లోకి సుమారు 15 కోట్ల గ్యాలన్ల వరద నీరు చేరి నిండింది. ఇది చెర్వును తలపించేలా మారి 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది.
బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతోపాటు గదిలోకి చేరిన వరద నీటిని బయటికి పంపించేందుకు కంపెనీకి అదనపు భారం ఏర్పడింది. గనిలో చేరిన వరద నీటిని ప్రైవేట్ మోటర్ల తో బయటికి పంపిందుకు గత ఐదు రోజుల నుండి ముమ్మరంగా పనులు ప్రారంభించారు. మరోవైపు 280 వేల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు నిలిచి పొయ్యాయి. మొత్తంగా కోయగూడెం ఓసీలోలో వర్షాల వల్ల సింగరేణి కంపెనీకి సుమారు 30 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లింది. గని లోకి వచ్చే వరద నీటిని గమనించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి నట్లు ఆరోపణలున్నాయి.
గతంలో కూడా మరో గనిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల వరద నీరు చేరి ఆ నీటిని బయటికి పంపించేందుకు అధికారులు నానా తంటాలు పడవలసి వచ్చింది. గని పక్కనుండే అనేక పిల్ల వాగులు ప్రవహిస్తుంటాయి. వర్షాలు వచ్చిననప్పుడు వాటి పట్ల అధికారులు తగు చర్యలు తీసుకోక పోవడం వల్ల ఈ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా అధికారుల నిర్లక్ష్యం సింగరేణికి కోట్ల ఆదాయాన్ని నష్ట పరిచిందనే చెప్పాలి. ఇల్లందు జెకే 5ఓసిలో 110వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికి తీత పనులు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా సింగరేణి వరుస సంఘటనలతో కోట్లలో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. వర్షాలు ఓ కారణమై ఉత్పత్తి నిలిచి పోవడం, ఓసీ లోకి నీరు చేరి అదనపు ఆదాయ వ్యయం భారం మోయడం జరుగుతోంది. ఇటీవల ఇల్లందు జెకే 5 ఓసీలో ఓబీలో డ్రిల్లింగ్ మిషన్ కూరుకొని పోవడం లాంటి సంఘటనలు కంపెనీ నష్టాలకు దారితీసింది.
PM Modi: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ