డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని.. ఈ డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న విజయోత్సవ సభ ఖమ్మంలోనే ఉంటుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. భట్టి పాదయాత్ర చేసినందుకు అభినందిస్తున్నామన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
భారత్ జోడో యాత్రకు కొనసాగింపే ఈ పీపుల్స్ మార్చ్ యాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పాదయాత్రలో అందరి కష్టాలను తెలుసుకున్నామని ఆయన తెలిపారు. పీపుల్స్ మార్చ్‌ను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించామని భట్టి పేర్కొన్నారు.
ఆదిలాబాద్ నుంచి ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మంలో ముగిసింది. 13 కి.మీ దూరంలో నిన్న బస చేసిన బట్టి.. ఇవాళ జనగర్జన సభకు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ముగించారు. 109 రోజులు.. 1360 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేపట్టారు. మరోవైపు జనగర్జన సభ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.
ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్.. గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షన్‌తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉండగా... పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో విజయవంతం అయింది.
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. కర్ణాటక ఎన్నికల తర్వాత అటు ఏపీ, ఇటు తెలంగాణలో ముమ్మరంగా కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. కొన్ని రోజులు క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేపట్టారు.
తెలంగాణలో ఖమ్మం వేదికగా కాంగ్రెస్ పార్టీ నేడు జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరనున్నారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరవుతున్న జనగర్జన సభ కోసం ఖమ్మం నగరం అందంగా ముస్తాబైంది. ఖమ్మం నగరంలో అడుగడుగునా మూడు రంగుల జండాలే దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా.. కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుందరంగా మారింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ లతో అలంకరించారు. పట్టణంలో ప్రధాన రహదారులు, చౌరస్తాలు, కూడళ్లు, విద్యుత్ స్థంభాలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో అత్యంత సుందరంగా అలంకరించారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేరుకుంది. రహదారిపై పాదయాత్రగా వెళ్తున్న భట్టికి.. కొలిమి వద్ద ఇనుప పని చేసుకుంటున్న బాలాజీ వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తాము మహారాష్ట్ర నుంచి ఇక్కడకు పనిచేసుకునేందుకు వచ్చామని.. పెరిగిన ధరల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై పరోక్షంగా విమర్శించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అధికారం మదంతో కొంత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. కబ్జాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయి.