Off The Record: ఒకరు ఎస్ అంటే…ఇంకొకరు నో అనడం కాంగ్రెస్ డీఎన్‌ఏలో ఉన్న సహజ లక్షణం. తెలంగాణ కాంగ్రెస్‌నే తీసుకుంటే… ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. పార్టీలోకి చేరికల విషయంలో కూడా ఇదే పెద్ద సమస్యగా మారిపోతోందట. ప్రస్తుతం కొందరు నాయకుల చేరికపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. వచ్చేస్తాం… మీ పార్టీలోకి అని ఆ నాయకులు అడుగుతుంటే…. లోపల ఉన్నవారు మాత్రం పేచీల మీద పేచీలు పెట్టేస్తున్నారట. మాజీ…
ఖమ్మం జిల్లా కల్లూరులో బీఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వైద్య,ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. బీజేపీ వాళ్లు తెలంగాణలో గెలుస్తాం అని మాట్లాడుతున్నారని.. కానీ ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కాదు కదా.. డిపాజిట్ కూడా రాదన్నారు. జిల్లాలో డిపాజిట్ రాని పార్టీ రాష్ట్రం లో అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు.
తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన ఉద్యమ కార్యాచరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వరుసగా నిరుద్యోగ నిరసన ర్యాలీలు, దీక్షలకు పిలుపునిచ్చింది. పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యార్థి వ్యతిరేక విధానాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యం వంటి తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించింది.
ప్రభుత్వ అధికారి ఏది మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అయితే ఈ విషయాన్ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మరిచిపోతున్నారా? ఏ మీటింగ్ లో పాల్గొన్నా ఆయన మాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో ఇవాల (గురువారం) ఉదయం మంత్రి కేటీఆర్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు.
Karepally : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి(Karepally), చీమలపాడు ప్రమాద ఘటనపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సమీపంలో సిలిండర్లు పేలడంతో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడడం బాధాకరమన్నారు.
మ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడు వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చి, ధైర్యం చెప్పేందు సీఎం కేసీఆర్ ఇవాల నాలుగు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రైతులకు అంండగా వుండి ప్రభుత్వం పరిహారం ఇస్తుందని అధైర్య పడకూదని సీఎం కేసీఆర్ రైతులతో స్వయంగా మాట్లాడుతూ ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించారు.