15 Injured Khammam Road Accident: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూసుమంచి సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై లోక్యాతండా వంతెన వద్ద శనివారం తెల్లవారుజూమున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతుండగా…
ఖమ్మం జిల్లాలోని కోదాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు.. గోకినపల్లి సమీపంలో ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మృతుల్లో ఒకరు రెండేళ్ళ చిన్నారి ఉంది. ఆటో నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలు చిందరవందరగా పడిపోయాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. మృతులు నేలకొండపల్లి…