Air India Kanishka bombing case: 1985 ఎయిర్ ఇండియా కనిష్క బాంబు పేలుడు ఘటనలో అనుమానితుడిగా ఉండీ, నిర్దోషిగా విడుదలైన సిక్కు వ్యక్తి రిపుదమన్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులు ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారుర. వీరికి కెనడియన్ కోర్టులో సెకండ్ డిగ్రీ హత్య కేసు నమోదైనట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
Delhi Police: ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ దగ్గర ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు ఖలిస్తాన్ వేర్పాటవాదులకు ఉన్న లింక్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక, అంశంపై తాజాగా ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానెల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని దర్యాప్తు టీమ్ ఆ లేఖలో కోరింది.
India-Canada Issue: భారత్, కెనడాల మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదంగా మారింది. గతేడాది నిజ్జర్‌ని కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే, ఈ హత్యలో భారత్ ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్‌లో ఆరోపించడంతో వివాదం చెలరేగింది.
Khalistani Terrorist: గత ఏడాది ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నారని అమెరికా న్యాయ శాఖ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ దాడులు చేసేందుకు యత్నించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.
India- Canada Row: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య చిచ్చుపెట్టింది. గతేడాది నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తాజాగా కెనడా ప్రభుత్వం ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని, ముఖ్యంగా భారత అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో పాటు మరికొందరు ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించింది.
India-Canada: భారత్ కెనడాల మధ్య మరోసారి దౌత్యయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో పాటు పలువురికి సంబంధం ఉందని కెనడా ఆరోపించింది. ఈ ఆరోపణలపై భారత్ తీవ్రంగా ఫైర్ అయింది. కెనడాలో తమ భారతీయ హైకమిషనర్‌తో సహా ఆరుగురిని విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఇండియాలో కెనడాకు చెందిన ఆరుగురు దౌత్యవేత్తలు శనివారం లోగా భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఈ పరిణామాలతో…
India-Canada Conflict: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాపులారిటీ అక్కడ రోజురోజుకు పడిపోతోంది. మరోవైపు ప్రభుత్వంపై కొందరు ఎంపీలు అసమ్మతి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిన్నింటి పక్కకు తప్పించి, మరోసారి సిక్కులు, సిక్కు ఎంపీల మద్దతు పొందేందుకు ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యని ముందుకు తీసుకువచ్చారు. ఈ కేసులో కెనడాలోని భారత అగ్రశ్రేణి దౌత్యవేత్తల ప్రమేయం ఉన్నట్లు ఆరోపించడంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య దౌత్యయుద్ధం మొదలైంది. భారత్ ఇప్పటికే…
భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆ అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్ణయం తీసుకోవడానికి తాము రెడీగా ఉన్నామంటూ రెచ్చగొట్టేలా కెనడా విదేశాంగ మంత్రి జోలీ రియాక్ట్ అయ్యారు.
India-Canada Row: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనుమానితుల లిస్టులో ఏకంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చి భారత్ తో కెనడా కయ్యానికి కాలుదువ్వింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును తెర పైకి తెచ్చి భారత్‌పై బురద జల్లే ప్రయత్నం చేసిందన్నారు.
Bhagwant Mann: ఖలిస్తాన్ మద్దతుదారు, ఈ ఏడాది పంజాబ్ లోని ఖదూర్ సాహిబ్ ఎంపీగా గెలిచిన అమృత్‌పాల్ సింగ్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కి ప్రాణహాని ఉందని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. అమృత్‌పాల్, అతడి సన్నిహితుల నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలకే కాకుండా, సీఎం ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పారు. పంజాబ్ పోలీసులు వారి వాదనలకు మద్దతుగా గతంలో అమృత్‌పాల్ సింగ్ చేసిన ప్రసంగాలకు సంబంధించి వీడియో క్లిప్‌లను ప్రస్తావించారు.