Yash19: కెజిఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రాకింగ్ స్టార్ గా మారిపోయాడు కన్నడ నటుడు యష్. సీరియల్స్ తో తన కెరీర్ ను ప్రారంభించిన యష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా మారాడు. కెజిఎఫ్ సినిమాతో యష్ జీవితమే మారిపోయింది. ఇక కెజిఎఫ్ 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.