AP High Court: సమగ్ర శిక్ష పథకం కింద నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో (కేజీబీవీ) శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియమించే వ్యవహారంపై మార్గదర్శకాలు రూపొందించి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. దేశ వ్యాప్తంగా పేద పిల్లల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని.. శాశ్వత సిబ్బందిని నియమించే విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్చలు జరపాలని పేర్కొంది.. తదుపరి విచారణలో చర్చల పురోగతిని కోర్టుకు చెప్పాలని ఆదేశించింది హైకోర్టు..…
Snake : హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఓ పాఠశాలలో బుధవారం ఉదయం విద్యార్థినులకు ఓ ఆందోళనకర అనుభవం ఎదురైంది. వారు రోజూ ఉపయోగించే టాయిలెట్‌లో ఓ భారీ కొండచిలువ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, కమలాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతిగృహంలోని టాయిలెట్‌లో దాదాపు 10 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ కనిపించింది. ఉదయం శుభ్రత పనులు జరుగుతున్న సమయంలో స్కూల్ సిబ్బంది ఈ దృశ్యాన్ని గుర్తించి షాక్‌కు…
Nirmal: నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) లోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి భోజనం చేసి 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరికి నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు కేటాయించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4,982 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఉంటే అందులో 696 అంటే సుమారుగా 15 శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.