ఎంతో కాలంగా నా పేరుతో నకిలీ కారు స్టిక్కర్ ను ఉపయోగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎంపీ స్టిక్కర్ పేరుతో బెదిరింపులు, మోసాలకు పాల్పడుతున్నారని తన సోదరుడిపై ఆరోపణలు గుప్పించారు ఎంపీ కేశినేని నాని
తెలుగు దేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది.. పార్టీలోని విభేదాలు, ఎన్నికల్లో పోటీ విషయం ఇలా ఎన్నో సందర్భాల్లో అలకలు, బుజ్జగింపులుగా సాగుతూ వస్తోంది.. ఇప్పుడు కేశినేని ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది.. టీడీపీ సీనియర్ నేత, ఎంపీ కేశినేని నాని తన సోదరుడైన కేశినేని చిన్నిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చగా మారింది.. తన పేరు, హోదాను అడ్డుపెట్టుకుని గుర్తు తెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని, నకిలీ వీఐపీ…
చాలా కాలం తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ నేతలతో కలిసి టీడీడీ ఎంపీ కేశినేని నాని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్ని కుల క్షత్రియుల భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంపీ కేశినేని నాని రూ. 65 లక్షలు కేటాయించారు. విజయవాడ ఆటో నగర్‌లో తమకున్న స్థలంలో అగ్నికుల క్షత్రియులు భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు ఎంపీ ల్యాడ్స్ నిధులను కేటాయించినందుకు ఎంపీ కేశినేని నానికి అగ్నికుల క్షత్రియులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ…
బెజవాడ టీడీపీలో అగ్గి రాజుకున్నట్టే కన్పిస్తోంది. నిన్నటి వరకు ఎంపీ కేశినేని నాని వర్సెస్ మిగిలిన లీడర్లు అన్నట్టుగా ఉండేది. కేశినేని నానికి వ్యతిరేకంగా బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ వంటి వారు రాజకీయం చేసేవారు. బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ.. ఆ తర్వాత ఒకట్రోండు సందర్భాల్లోనూ గొడవలు బహిర్గతమైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయి.. కేశినేని నాని పార్టీ అధినాయకత్వంతో సఖ్యతగా ఉండడం మొదలు పెట్టారు. అయితే బెజవాడ…
కేశినేని నాని కేంద్రంగా బెజవాడ టీడీపీ రాజకీయం మరోసారి వేడెక్కుతోందా? కొత్తగా కేశినేని వర్సెస్ కేశినేని అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా? ఎందుకలా? విజయవాడ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఈ ఎపిసోడ్‌లో మరోవర్గం ఎలాంటి పాత్ర పోషిస్తోంది? కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని బెజవాడ టీడీపీలో అగ్గి రాజుకున్నట్టే కన్పిస్తోంది. నిన్నటి వరకు ఎంపీ కేశినేని నాని వర్సెస్ మిగిలిన లీడర్లు అన్నట్టుగా ఉండేది. కేశినేని నానికి వ్యతిరేకంగా బుద్దా వెంకన్న, నాగుల్ మీరా,…
తీవ్ర ఉత్కంఠ మధ్య కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చేయి ఎత్తి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబుకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి జోగి రాముకు వైసీపీ కౌన్సిలర్ల మద్దతు లభించింది. టీడీపీ వైస్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు లక్ష్మీ, శ్రీనివాస్ కు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. ఎక్స్ అఫిషీయో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు టీడీపీ ఎంపీ…
ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ముగిసింది. ఇక మునిసిపల్ ఛైర్ పర్సన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 29 స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి. చెరో 14 స్థానాలు దక్కించుకున్నాయి వైసీపీ, టీడీపీ. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా టీడీపీ తన సత్తా చాటుకుంది. టీడీపీకి మద్దతిస్తూ పార్టీలో చేరారు ఇండిపెండెంటుగా గెలిచిన లక్ష్మీ. దీంతో ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఎక్స్…
చంద్రబాబుకు ఎంపీ కేశినేని టాటా..! ఏపీ టీడీపీతోపాటు పొలిటికల్ సర్కిళ్లలో విస్తృత చర్చకు దారితీసిన అంశం ఇది. ఎంపీ ఆఫీస్‌లో ఒక్క ఫొటో మార్పు.. పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ కేశినేని మనసులో ఏముంది? పార్టీ మారుతున్నారనే ప్రచారం వెనక కథేంటి? కేశినేని భవన్‌లో ఫొటో మార్పుతో రచ్చ రచ్చ..! బెజవాడ టీడీపీలో రాజకీయ రచ్చ తగ్గేలా లేదు. పార్టీలో వర్గ విభేదాలవల్ల ప్రతి అంశం చర్చగా మారుతోంది. 2024 ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పిన ఎంపీ…
బెజవాడ టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బెజవాడ టీడీపీలో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. బెజవాడలోని కేశినేని భవన్‌లో చంద్రబాబు ఫొటోలను తొలగించారు. చంద్రబాబు ఫొటోలతో పాటుగా, టీడీపీ నేతల ఫొటోలను కూడా తొలగించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఆఫీసు లోపల ఉన్న పార్టీ నేతల ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు. నేతల ఫొటోల స్థానంలో రతన్ టాటా ఫొటోలను ఉంచారు సిబ్బంది. ఇక ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎంపీగా మాత్రమే కొనసాగుతానని…