ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ రథం సెంటర్ నుంచి చిట్టినగర్ వరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షైక్ అసిఫ్ ఆధ్వర్యంలో రోడ్డు షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు తాను వైసీపీ ముఖ్య నాయ�
ప్రతి ఇంటికి వెళ్తుంటే వాలంటరీలు ఉన్నప్పుడు మాకు పెన్షన్ మా గడపకే తెచ్చేవారు అని చెబుతున్నారు.. మేము మళ్ళీ జగనన్న గెలిపించుకుంటామని చెప్తున్నారని కేశినేని శ్వేత అన్నారు.
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి త్వరలో తాళం వేసి.. ఆయన హైదరాబాద్ కు జంప్ అవుతారని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చెప్పుకొచ్చారు. అలాగే, బీజేపీలో తెలుగుదేశాన్ని కూడా విలీనం చేస్తారన్నారు.
విజయవాడ వ్యాపార రంగానికి వస్త్రలత ఒక ల్యాండ్ మార్క్ వంటిదని కేశినేని శ్వేత అన్నారు. వస్త్రలత కార్మికుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని.. వైఎస్సార్‌సీపీ కార్మికుల, కర్షకుల పక్షపాత పార్టీ అని వ్యాఖ్యానించారు.
చార్లెస్ శోభరాజ్ కంటే కేశినేని చిన్ని పెద్ద మోసగాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు కేశినేని నాని.. గతంలో కేశినేని చిన్ని కారు నంబర్లు 5555.. నావి 7777.. కానీ, నేను ఎంపీ అయ్యాక తాను కూడా కారు నంబర్లు 7777 వాడాడు.. అంతేకాదు రియల్ ఎస్టేట్ దందాల కోసం వందల స్టిక్కర్లు కార్లకు వేసి వాడాడు.. నేను నా స్టిక్కర్ ఫేక్ వి తయారు �
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ఎన్నికలు లోకల్కి, నాన్లోకల్కి మధ్య జరుగుతున్నాయని కేశినేని శ్వేత అన్నారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి కనీసం ఓటు హక్కు కూడా లేదని విమర్శించారు. పొలిటికల్ టూరిజం కోసం ఆంధ్ర రాష్టం మీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35, 42వ డివిజన్లలో తన తండ్ర�
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు ప్రచార జోరును పెంచారు. విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
జగన్ను, వైసీపీని ఎప్పుడూ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పేర్కొన్నారు. పాలసీ పరంగానే విమర్శలు చేశానన్నారు. విజయవాడ అభివృద్ధి నా అజెండా అని ఆయన పేర్కొన్నారు.