కేరళలో పినరాయి విజయన్ నాయకత్వాన ఎల్డిఎఫ్ ప్రభుత్వం వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసింది. నలభై ఏళ్లలో తొలిసారి అక్కడ ఒక ప్రభుత్వం మళ్లీ విజయం సాధించడం చారిత్రాత్మక విజయంగా పరిగణిస్తున్నారు. 1957లో ఇంఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వాతన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం నుంచీ తర్వాత ఎల్డిఎఫ్ ప్రభుత్వావరకూ ఏదీ మళ్లీ గెలిచిందిలేదు.1982 నుంచి ఎల్డిఎఫ్ యుడిఎఫ్ ఒకదాని తర్వాత ఒకటి గెలవడమే జరుగుతూ వస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఎల్డిఎఫ్ ఒక స్థానం తప్ప…
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ శుక్రవారం 61వ పుట్టిన రోజును జరుపుకున్నారు. నిజానికి అందులో పెద్ద విశేషం లేదు. కానీ ఈ యేడాది ఆయన పుట్టిన రోజును గతంలో కంటే కూడా భిన్నంగా ఓ గొప్ప మానవతామూర్తిగా జరుపుకున్నారు. ప్రస్తుతం కొవిడ్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అందులో కేరళ కూడా మినహాయింపేమీ కాదు. అయితే మల్లూవుడ్ కు చెందిన ఈ మెగాస్టార్ తన పుట్టిన రోజు సందర్భంగా తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా కేరళలోని వివిధ ప్రాంతాలలో…
కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజకు మరోసారి కేబినెట్లో చోటు దక్కుతుందని అంతా భావించారు.. కోవిడ్ కట్టడికి ఆమె చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.. దీంతో.. మళ్లీ ఆమె ఆరోగ్యశాఖ మంత్రి అనే ప్రచారం జరిగింది. కానీ, సీపీఎం తీసుకున్న ఓ నిర్ణయంతో.. ఆమెతో పాటు పాత మంత్రులకు ఎవరికీ అవకాశం దక్కలేదు.. సీఎం పినరాయి విజయన్ మినహా పాత వారు ఎవరూ కేబినెట్లో లేకుండా పోయారు.. అయితే, శైలజా టీచర్‌గా పేరుపొందిన ఆమెకు…
భారత్‌లో కరోనా కట్టడిలో కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది.. దీని వెనుక సీఎం పినరయి విజయన్‌తో పాటు.. ఇప్పటి వరకు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కేకే శైలజ కృషి ఎంతో ఉంది.. దానికి తగ్గట్టుగానే ఆమెకు వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి, ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.. అరుదైన గౌరవాన్ని కల్పించాయి. అయితే, తాజాగా జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు శైలజా టీచర్.. మత్తన్నూర్ నియోజకవర్గం నుంచి…
ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనిస్తుండడంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తౌక్టే తుఫాన్ తో కేరళ వణికిపోతుంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది కేరళ ప్రభుత్వం. తరుముకొస్తున్న ఈ తుఫాన్ ఆరు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడులో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అంతేకాదు 12 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్నట్లుగా తెలిపింది.…
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైన తౌక్టే తుఫానుగా మారింది. ప్రస్తుతం ఈ తుఫాను గోవాకు 222 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం కారణంగా ప్రస్తుతం కేరళలో భారీ వర్షాలు గాలులు వీస్తున్నాయి. కేరళలో 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల ధాటికి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈనెల 18 వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్, నలియా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది. దీంతో గుజరాత్ లోని…
ఓవైపు కరోనా పంజా విసురుతుంటే.. మరోవైపు.. తుఫాన్… కేరళను వెంటాడుతోంది… అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను తీవ్రరూపం దాల్చడంతో.. కేరళలో శనివారం ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి… రాష్ట్రంలోని మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, కాసర్‌గోడ్‌తో సహా పలు జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షాపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఐఎండీ. దీంతో.. రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొల్లం, పతనమిట్ట, అలప్పుజ, ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్‌ల్లో ఆరెంజ్ అలర్ట్, తిరువనంతపురం,…
ఇండియాలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. దేశంలో ముంపు దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూరుకు 360 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగాల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడి ఈ నెల 16న తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫానుగా మారితే దీన్ని ‘తౌక్టే’ అని పిలుస్తారు. ‘తౌక్టే’ తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది.. గుజరాత్ వద్ద…
నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభ ఎన్నికలు ముగిసి నూతన ప్రభుత్వాలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాల్లో వున్న ప్రభుత్వాలే తిరిగి వస్తున్నాయి. పుదుచ్చేరిలో ప్రభుత్వం మారుతున్నా అదే నేతలు పార్టీలు మారి కొత్త రూపంలో వస్తున్నారు. కనుకనే ఈ అయిదు ఎన్నికలు ఒకే పాఠం ఇస్తున్నాయి. అన్నిటిలోకి అత్యంత నాటకీయంగా కనిపించేది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఘన విజయం. ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా మకాం వేసి ఆ…