దేశంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ తగ్గిపోతుందని అనుకున్నా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక కేరళలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు, 200 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. ఓనం ఫెస్టివల్ తరువాత ఈ పరిస్థితి నెలకొన్నది. గురువారం రోజున 30,007 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేరళలో పాజిటివిటి రేటు 18.03 శాతంగా ఉంది. కరోనా…
థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి.. కేరళ, కర్నాటక కేంద్రంగా అది విజృంభించనుందా? అంటే అలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. కేరళలో అయితే పరిస్థితి మరీ దారుణం. ఓనమ్ తరువాత పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగాయి. బుధవారం ఒక్క రోజే 31 వేల 445 కేసులు రిజిస్టరయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఇది 65 శాతం. అలాగే టెస్ట్ పాజిటివ్ రేట్ కూడా అమాంతం పెరిగింది. ప్రస్తుతం అది 19 శాతంగా ఉంది. మే 20 తరువాత కేరలలో…
మెడికల్ టూర్ నిమిత్తం రేపు కేరళ వెళ్లనుంది ఆంధ్రప్రదేశ్ బృందం.. ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళలోని వైద్య విధానాలను అధ్యయనం చేయనుంది ఆంధ్రప్రదేశ్ టీమ్.. కేరళ ప్రభుత్వం అవలంభించిన కరోనా వ్యాప్తి నిరోధక చర్యలనూ పరిశీలించనున్నారు ఏపీ అధికారులు.. కేరళ వైద్య విధానాలను ఏపీలో అవలంభించాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కాగా, సీఎం వైఎస్ జగన్ సూచనలతో కేరళ వెళ్లనుది ఏపీ అధికారుల బృందం. మరోవైపు.. కేరళలో కరోనా మొదటి దశలో.. రెండో వేవ్‌లోనూ…
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతూ వచ్చినా.. కేరళలో మాత్రం భారీగానే పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూ వచ్చాయి.. ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూవాయి.. కేరళ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో 31,445 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 215 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 19.03గా నమోదైంది.. మళ్లీ కోవిడ్…
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, ఉగాది పండుగలను ఎంత బాగా జరుపుకుంటామో కేరళలో అంతే సందడిగా ఓనం పండగను జరుపుకుంటారు. కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఓనం పండగ ఒకటి.. ఈ పండగను మళయాళీలందరూ భక్తి శ్రద్దలతో, కుటుంబసభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటారు.ఈ పండగను 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పది రోజులు అనేక సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో పాటు వివిధ సాహస కార్యక్రమాలు చేపడతారు. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించే తీరు…
కరోనా సెకండ్ వేవ్ కేసులు అన్ని రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతూ వస్తున్నా.. కేరళలో మాత్రం ఇంకా పెద్ద సంఖ్యలోనే పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి.. దీనికి పెద్ద సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం కూడా కారణంగా చెబుతున్నారు.. అయితే, కరోనా అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ 2 కింద కేరళ రాష్ట్రానికి రూ.267.35 కోట్ల నిధులు కేటాయించినట్లు ఇవాళ ప్రకటించారు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా.. ఇవాళ తిరువనంతపురం వెళ్లిన మాన్సుఖ్ మాండవియా.. ఆ రాష్ట్ర…
కేరళలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ 20 వేలకు పైగా కేసులు బయటపడుతుండటంతో ఆ రాష్ట్రం కట్టడికి కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇక, దేశంలో ఎలాంటి విపత్తులు కలిగినా వెంటనే స్పందించే రిలయన్స్ సంస్థ మరోమారు ముందుకు వచ్చి కేరళకు సహాయాన్ని అందించింది. కేరళ రాష్ట్రానికి 2.5 లక్షల కోవీషీల్డ్ టీకాలను ప్రభుత్వానికి అందజేసింది. కరోనా కట్టడికి చేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రిలయన్స్ అందించిన వ్యాక్సినేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్…
కేరళ అమ్మాయి హైదరాబాద్ యువకులనే టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో వల వేస్తుంది. కొన్ని రోజులు ఎంజాయ్ చేసి. పెళ్లి చేసుకుందామని నమ్మిస్తుంది. అడిగిన ప్రతిసారి డబ్బులు ఇవ్వాలి.. లేదంటే అక్రమ కేసులు పెట్టి జైలు పాలుచేస్తుంది. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు, భర్తతో జీవనం సాగిస్తూ… ఈ మోసాలకు పాల్పడుతోంది కిలాడి లేడి. ఈ లేడిపై పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. ఈ మహిళా చేతిలో మోసపోయిన బాధితుడు న్యాయం కోసం రాష్ట్ర…
బెంగాల్లో మూడోసారి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీకి దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోతున్నది. దేశంలోని అన్ని అన్నిరాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలనే అలోచనలో దీదీ ఉన్నట్టు సమాచారం. దానికి ఇదే సాక్ష్యం అని చెప్పొచ్చు. కేరళలో దీదీని పిలవండి… దేశాన్ని కాపాడండి…ఛలో ఢిల్లి… పేరుతో పోస్టర్లు వెలిశాయి. కేరళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఈ పోస్టర్లు వెలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 34 ఏళ్లు ఏకచక్రాధిపత్యంగా బెంగాల్‌ను శాశించిన వామపక్షాల కోటను బద్దలుకొట్టి 2011లో దీదీ అధికారంలోకి వచ్చింది.…
కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజువారి పాజిటివ్ కేసులు 20 వేలకు పైగా నమోదవుతుండటంతో కేరళ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నప్పటికీ, కేసులు కంట్రోల్ కావడంలేదు. పైగా రోజువారీ కేసులు భారీ స్తాయిలో పెరుగుతుండటంతో ప్రభుత్వం కట్టడికి కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నది. ఇకపై ప్రతి ఆదివారం రోజున రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో రోజువారీ కేసుల్లో సగం కేసులు కేరళ…