కోవిడ్ ఉగ్రరూపం..! టెస్ట్ చేసిన తర్వాతే ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో కరోనా కేసులు ప్రతీరోజు 40 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి.. ఇక, ఈ కేసుల్లో అగ్రభాగం మాత్రం కేరళ రాష్ట్రానిదే.. సెకండ్ వేవ్ వెలుగుచూసినప్పట్టి నుంచి కేరళలో కోవిడ్ కంట్రోల్లోకి వచ్చింది లేదు.. అయితే, ఆ రాష్ట్రంలో కోవిడ్ ప్రారంభమైన తొలినాళ్లలో తీసుకొచ్చిన కరోనా ట్రేసింగ్ విధానాన్ని కొనసాగిస్తూ.. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో టెస్ట్‌లు చేయడమే.. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణమని చెబుతున్నారు. మరోవైపు.. ఆ రాష్ట్రంలో కోవిడ్ ఉగ్రరూపం కొనసాగుతుండడంతో.. కేరళ సరిహద్దుల్లో టెస్ట్‌లు చేపడుతున్నారు.. కేరళ సరిహద్దు ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి కరోనా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.. మరోవైపు కేరళ నుంచి వచ్చే ప్రతివాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు తమిళనాడు అధికారులు.. వాహనాల్లో వచ్చేవారందరికీ థర్మల్‌స్కాన్ చేస్తున్నారు. రెండు డోసుల టీకా వేసుకున్నట్లు ధ్రువపత్రాలతో వచ్చేవారిని మాత్రం ఎలాంటి పరీక్షలు చేయకుండా రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.. రాకపోకలు సాగించేవారితో కోవిడ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక వైద్యపరీక్షల శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ఓవైపు కేరళ అధికారులు.. మరోవైపు తమిళనాడు అధికారులు టెస్ట్‌లు చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
తాజావార్తలు
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్‌కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!