కేరళ లో ఇప్పటికే కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు 30 వేల కరోనా కేసులు వెలుగు చూస్తున్న ఈ తరుణంలో ఇపుడు నిఫా వైరస్ కూడా వ్యాపిస్తుంది. తాజాగా కేరళలో 12 ఏళ్లబాలుడు నిఫా వైరస్ కారణంగా మృతి చెందాడు. ఇక రాష్ట్రంలో నిఫా వైరస్ వుందని కేరళ వైద్య శాఖ అధికారికంగా ప్రకటించింది. నిఫా వైరస్ తో మృతి చెందిన బాలుడి బంధువులను ట్రేస్ చేస్తున్నారు కేరళ వైద్య శాఖ అధికారులు. కోళికోడ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ నిఫా వైరస్ మరణం సంభవించింది. పూణె లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లో బాలుడి రక్తం శాంపిల్స్ ను పరీక్షలకు పంపగా బాలుడు నిఫా వైరస్ తో మృతి చెందాడని స్పష్టం అయ్యింది. అయితే గతం లో రెండేళ్ల కిందట నిఫా వైరస్ తో కేరళ లో వందల సంఖ్యలో మరణాలు సంభవించిన విషయం తెలిసిందే.