Nipha Virus: కేరళ నుండి రిలీఫ్ వార్తలు వస్తున్నాయి, ఎందుకంటే వరుసగా రెండవ రోజు కూడా ప్రాణాంతక నిఫా వైరస్ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేరళలో నిఫా వైరస్ నియంత్రణకు గురైనట్లు కేరళ ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది.
Nipha Virus: మలేషియాలో 19 ఏళ్ల క్రితం నిపా వైరస్ను గుర్తించారు. ఈ వైరస్ 2018 లో భారతదేశంలో కనుగొనబడింది. నిపా వైరస్ను తొలిసారిగా కేరళలో గుర్తించారు. అయితే ఐదేళ్ల తర్వాత కేరళలో నిపా వైరస్ విజృంభణ మరోసారి పెరిగింది.
Sabarimala: కేరళలో నిపా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఆరుగురికి నిపా వైరస్ సోకగా.. ఇద్దరు మరణించారు. మరో నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిపా నేపథ్యంలో శబరిమల యాత్రికులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శబరిమల యాత్ర కోసం అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ కార్యదర్శితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ట్రావెన్కోర్ దేవస్వ బోర్డును కోర్టు కోరింది.
Nipah Virus: కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఆరుగురికి వైరస్ సోకగా.. ఇద్దరు మరణించారు. ముఖ్యంగా కోజికోడ్ జిల్లాలో హైఅలర్ట్ కొనసాగుతోంది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటి వరకు నమోదైన అన్ని కేసులు కూడా అటవీ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో విజృంభిస్తున్నా నిపా వైరస్ ‘బంగ్లాదేశ్ వేరియంట్’ అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా…
Nipah Virus: కేరళలోని కోజికోడ్లో నిపా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి భయానక వాతావరణం నెలకొంది. నిపా వైరస్ దృష్ట్యా, కోజికోడ్లోని అన్ని విద్యాసంస్థలు వచ్చే ఆదివారం వరకు అంటే సెప్టెంబర్ 24 వరకు మూసివేయబడ్డాయి.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో శుక్రవారం నిపా వైరస్ సోకిన మరో కేసు నిర్ధారించారు. ఓ 39ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్ సోకినట్లు నిర్ధారించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కార్యాలయం శుక్రవారం తెలిపింది.
Father Killed his Son’s Family in Kerala: కన్న తండ్రి మమకారం మరిచి కసాయిలా మారిపోయాడు. ఇంట్లో జరిగే గొడవలు ఎక్కడైనా సహజం అని తెలిసినా ఆ వ్యక్తి విచక్షణా కోల్పొయాడు. కన్న కొడుకు మీదే పగ తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి కన్న కొడుకు కుటుంబాన్నే కడతేర్చాడు. నిద్రిస్తున్న వారి మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో కొడుకు, మనవడు చనిపోగా కొడలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటన కేరళలోని త్రిసూర్ జిల్లాలో…
Niaph Virus: కేరళలో నిపా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరొకరికి వైరస్ సోకినట్లు తెలిసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6కి చేరింది. ఇప్పటికే ఇందులో ఇద్దరు మరణించారు. తాజాగా 39 ఏళ్ల వ్యక్తికి నిపా పాజిటివ్ గా తేలింది. 2018 నుంచి చూస్తే కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ నాలుగో సారి విజృంభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న
Nipah Virus: నిపా వైరస్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా కోజికోడ్ జిల్లాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి ఐదుగురికి సోకింది. ఇందులో ఇద్దరు మరణించడంతో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటోంది.