West Bengal: ఉలిక్కిపడ్డ బెంగాల్.. కేరళ నుంచి పశ్చిమ బెంగాల్ లోకి నిపా వైరస్ ఎంట్రీ ఇచ్చిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man who Returned from Kerala to Bengal Admitted to Hospital with Nipah Symptoms: కేరళలో కలకలం రేపుతున్న నిఫా వైరస్ తాజాగా పశ్చిమ బెంగాల్ కు కూడా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పొట్టకూటి కోసం కేరళ వెళ్లి సొంత రాష్ట్రం అయిన పశ్చిమ బెంగాల్ కు తిరిగివచ్చిన ఓ యువకుడిలో నిఫా వైరస్ కు సంబంధించిన కొన్ని లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ లో కలకలం రేపుతుంది. నిఫా వైరస్ పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించిందా అనే అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బుర్ద్వాన్ జిల్లాకు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు పనికోసం కేరళకు వలస వెళ్లాడు. అయితే అక్కడ ఉన్నప్పుడే అతడికి ఆరోగ్యం పాడయ్యింది. కేరళలోనే అతడు తీవ్ర జ్వరంతో బాధపడ్డాడు. అక్కడి స్థానిక ఆసుపత్రిలో కొంతకాలం చికిత్స తీసుకున్న తరువాత అతడికి జ్వరం తగ్గడంతో డిశార్జ్ చేశారు. అక్కడి నుంచి యువకుడు నేరుగా పశ్చిమ బెంగాల్ కు చేరుకున్నాడు. అయితే స్వగ్రామానికి రాగానే రెండు రోజుల్లోనే అతడు మళ్లీ అనారోగ్యం పాలయ్యాడు.
Also Read: Tamilnaadu: తమిళనాడులో కలకలం.. నెల రోజుల్లో తొమ్మిది పెద్ద పులులు మృతి
Also Read
తీవ్ర జ్వరం, వికారం, గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరాడు. అయితే ఈ లక్షణాలు నిఫా వైరస్ లక్షణాలుగా కనిపించడం, అదీకాక అతడు కేరళ నుంచి వచ్చాడు అని తెలియడంతో వైద్యులు అతడికి నిఫా వైరస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇంకా అతడికి నిఫా వైరస్ సోకిందా లేదా అన్నది నిర్థారణ కాలేదు. తొలుత అతడిని నేషనల్ మేడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించారని, ఆ తరువాత బెలియఘాటా ఐడీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. నీపా కేసులు అధికంగా ఉన్న కేరళ వచ్చిన యువకుడి విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నామని ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక కేరళలో నిఫా వైరస్ కారణంగా మరణాలు కూడా సంభవించిన విషయం తెలిసిందే. ఈ విషయం దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కేరళలో ఈ కేసులు నమోదు కావడం లేదు. ఇప్పటి వరకు కేరళలో ఆరుగురుకి ఈ వైరస్ సోకింది. వారిలో ఇద్దరు దీని కారణంగా మరణించారు. అయితే గతంలో కూడా పలుమార్లు ఇక్కడ నిఫా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. 2018 కోజికోడ్ లో, 2019లో ఎర్నాకులంలో 2021లో మళ్లీ కోజికోడ్‌లో ఈ నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి.
- Tags
- bengal
- Kerala
- Nipah virus
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు