Lottery Ticket: లాటరీ టికెట్లు అంటే ఇండియాలో ముందుగా గుర్తుకువచ్చేది కేరళ రాష్ట్రమే. ఆ రాష్ట్రంలో లాటరీ టికెట్ల బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన ఉంటుంది. కేరళ లాటరీలు అక్కడి సాధారణ ప్రజల్ని కూడా కోటీశ్వరులను చేసిన సంఘటను ఉన్నాయి. అయితే కొన్ని సార్లు ఈ లాటరీ టికెట్లే హత్యలకు దారి తీస్తున్నాయి. కుటుంబాల మధ్య, స్నేహితుల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి.
Read Also: Canada: జీ20లో ప్రెసిడెన్షియనల్ సూట్ తిరస్కరించిన ట్రూడో.. ముందు నుంచే భారత్‌ని నిందించే ప్రయత్నం
తాజాగా లాటరీ టికెట్ విషయంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తన స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే కొల్లం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడిని చంపాడు. ఓనం బంపర్ లాటరీ టికెట్ విషయంలో అజిత్ అనే వ్యక్తికి, అతని స్నేహితుడు దేవదాస్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఓనం బంపర్ లాటరీని కొనుగోలు చేసిన దేవదాస్, తన స్నేహితుడు అజిత్ వద్ద టికెట్ ఉంచాడు. అయితే లాటరీ డ్రా డేట్ దగ్గర పడుతున్న సమయంలో తన టికెట్ ఇవ్వాలని అజిత్ ని కోరగా, అందుకు అజిత్ నిరాకరించడంతో గొడవ ప్రారంభమైంది.
ఘర్షణ సమయంలో ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. అజిత్ దేవదాస్ మధ్య మాటామాటా పెరిగి హింసాత్మకంగా మారింది. అజిత్, దేవదాసుని తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన దేవదాసుని అలప్పుజా ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలిస్తుండగా మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.