Kerala serial blasts: కేరళలో ఆదివారం జరిగిన వరస పేలుళ్లు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ పేలుళ్లలో ఇప్పటికే ఒకరు మరణించగా.. 40 మంది వరకు గాయపడ్డారు. కలమస్సేరిలో జరిగే ఓ మతపరమైన కార్యక్రమంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇటీవల కేరళలో పాలస్తీనా, హమాస్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీల అనంతం పేలుళ్లు సంభవించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
Kerala Bomb Blast: కేరళలో వరస పేలుళ్ల తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలో హై అలర్ట్‌లో ఉన్నాయి. పేలుళ్ల నేపథ్యంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పండగ సీజన్, రాబోయే క్రికెట్ మ్యాచులన నిర్వహణ నేపథ్యంలో ముంబై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
Kerala Bomb Blast: దేశంలో దాదాపుగా 10 ఏళ్ల కాలంగా ఎక్కడా కూడా బాంబు పేలుళ్లు చోటు చేసుకోలేదు. తాజాగా ఈ రోజు జరిగిన కేరళ వరస బాంబు పేలుళ్లతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. కేరళలో ఆదివారం ఉదయం జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించగా.. 36 మంది గాయపడ్డారు. కొచ్చిలో కన్వెన్షన్ సెంటర్ లో యోహోవా విట్నెస్ ప్రార్థనా సమావేశం ప్రారంభమైన కొద్ది…
1 Dead and 20 Injured in Bamb Blasts At Kerala: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో మూడు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఆదివారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో అక్కడ దాదాపుగా 2 వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం దీన్ని ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్,…
Suresh Gopi: మళయాల స్టార్ హీరో కమ్ పొలిటిషయన్ సురేష్ గోపి వివాదంలో చిక్కుకున్నారు. కేరళలోని కోజికోడ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(కేయూడబ్ల్యూజే) అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Kerala: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై భారత్ లో విభిన్న వాదనలతో ప్రజలు ఉన్నారు. అయితే కొంత మంది ఇజ్రాయిల్ కి మద్దతుగా, మరికొంత మంది పాలస్తీనాకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశంలోని పలు చోట్ల పాలస్తీనాకు సంఘీభావంగా ర్యాలీలు జరిగాయి. కేరళలోని మలప్పురంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ వివాదాస్పదమైంది.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.
Nipah virus: గత నెలలో కేరళ రాష్ట్రాన్ని మరోసారి ‘నిపా వైరస్’ వణించింది. కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి సోకి ఇద్దరు మరణించారు. అయితే కేరళ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని మిగిలిన వారికి ప్రాణాపాయం లేకుండా రక్షించగలిగింది. ఇదిలా ఉంటే తాజాగా నిపా వైరస్ గురించి ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ జిల్లాలోని గబ్బిలాల్లో నిపా వైరస్ ఉండే అవకాశం ఉందని ఆమె బుధవారం తెలిపారు. ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్…
Kerala: గతేడాది ఏప్రిల్‌లో కేరళకు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకుడు శ్రీనివాసన్ హత్య జరిగింది. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ దుమారాన్ని రేపింది. అధికార కమ్యూనిస్ట్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ కేసులో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక సభ్యుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది.
కేరళలోని సహకార బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలపై పినరయి విజయన్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ బుధవారం విమర్శలు గుప్పించారు. తీవ్రమైన బ్యాంకింగ్ అక్రమాలు, కుంభకోణాల కారణంగా సామాన్యుల జీవితాల పొదుపు ప్రమాదంలో పడుతుందని ఆంటోనీ అన్నారు.