Kerala: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై భారత్ లో విభిన్న వాదనలతో ప్రజలు ఉన్నారు. అయితే కొంత మంది ఇజ్రాయిల్ కి మద్దతుగా, మరికొంత మంది పాలస్తీనాకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశంలోని పలు చోట్ల పాలస్తీనాకు సంఘీభావంగా ర్యాలీలు జరిగాయి. కేరళలోని మలప్పురంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ వివాదాస్పదమైంది.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.
Nipah virus: గత నెలలో కేరళ రాష్ట్రాన్ని మరోసారి ‘నిపా వైరస్’ వణించింది. కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి సోకి ఇద్దరు మరణించారు. అయితే కేరళ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని మిగిలిన వారికి ప్రాణాపాయం లేకుండా రక్షించగలిగింది. ఇదిలా ఉంటే తాజాగా నిపా వైరస్ గురించి ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ జిల్లాలోని గబ్బిలాల్లో నిపా వైరస్ ఉండే అవకాశం ఉందని ఆమె బుధవారం తెలిపారు. ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్…
Kerala: గతేడాది ఏప్రిల్‌లో కేరళకు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకుడు శ్రీనివాసన్ హత్య జరిగింది. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ దుమారాన్ని రేపింది. అధికార కమ్యూనిస్ట్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ కేసులో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక సభ్యుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది.
కేరళలోని సహకార బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలపై పినరయి విజయన్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ బుధవారం విమర్శలు గుప్పించారు. తీవ్రమైన బ్యాంకింగ్ అక్రమాలు, కుంభకోణాల కారణంగా సామాన్యుల జీవితాల పొదుపు ప్రమాదంలో పడుతుందని ఆంటోనీ అన్నారు.
కేరళలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. ఈ కారణంగా ఈరోజు అక్కడ విద్యాసంస్థలను మూసివేశారు. కొట్టాయం, వైకోమ్, చంగనస్సేరి తాలూకాల్లోని విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది.
Kerala: గూగుల్ మ్యాప్స్, జీపీఎస్‌ని నమ్మిపోతే ఇద్దరు యువ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. కారు నదిలో మునిగిపోయి ప్రమాదం జరిగింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కొల్లాంకు చెందిన డాక్టర్ అద్వైత్(29), త్రిసూర్కి చెందిన డాక్టర్ అజ్మల్(29) జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రిలో విధులు ముగించుకుని కొడుంగల్లూరు నుంచి ఇళ్లకు బయలుదేరారు. వీరితో పాటు మరో ముగ్గరు డాక్టర్లు తబ్సిర్, తమన్నా, నర్స్ జిస్మాన్ కూడా ఉన్నారు.
కేరళ రైలు దహనం కేసులో నిందితుడిపై ఎన్ఐఏ (NIA) ఛార్జ్ షీట్ సిద్ధం చేసింది. నిందితుడు షారుక్ సైఫీ.. రాడికల్ వీడియోలు చూసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది. అంతేకాకుండా.. చార్జిషీట్లో పలు విషయాలను వెల్లడించింది.
క్రికెట్ వరల్డ్ కప్ కు సర్వం సిద్దమయ్యింది. అన్ని దేశాల తమ జట్లను కూడా ప్రకటించాయి. అసలైన సమరానికి ముందు వార్మప్ మ్యాచ్ లకు కూడా జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వివిధ జట్లు భారత్ చేరకున్నాయి. మొన్న పాక్ జట్టు హైదరాబాద్ చేరుకోగా తాజాగా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు కేరళ వెళ్లింది ఆస్ట్రేలియా క్రికెటర్ల టీం. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు తన తొలి వార్మప్ మ్యాచ్ లో భాగంగా నెదర్లాండ్స్‌తో తలపడనుంది.…