Space station: 2035 నాటికి భారత్కి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పడుతుందని, ఇది అంతరిక్ష విషయాలను కనుగొనేందుకు, అధ్యయనం చేసేందుకు దోహదపడుతుందని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు అన్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం(వీఎస్ఎస్సీ)లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో భారత వ్యోమగామని సొంత రాకెట్ ద్వారా చంద్రుడిపై దిగుతారని చెప్పారు.
PM Modi: కేరళలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ లెఫ్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. సీపీఎం వయనాడ్ లోక్సభ స్థానానికి అన్నీ రాజాను అభ్యర్థిగా పేర్కొన్న ఒక రోజు తర్వాత ప్రధాని ఈ రెండు పార్టీల తీరుపై మంగళవారం విమర్శలు గుప్పించారు. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ శత్రువులని, కానీ బయట BFF( బెస్ట్ ఫ్రండ్స్ ఫర్ఎమర్) అంటూ ఎద్దేవా చేశారు.
గగన్యాన్ మిషన్ కోసం ఎదురుచూస్తున్న భారత్కు ఇవాళ శుభవార్త అందింది. కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములను దేశానికి పరిచయం చేశారు.
PM Modi : లోక్సభ ఎన్నికల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రాలకు కోట్ల విలువైన బహుమతులు ఇస్తున్నారు.
Kerala: కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కగానొక్క కూతురు తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేరళలోని కొల్లాంలో చోటు చేసుకుంది. కొల్లాం పావుంబకు చెందిన ఉన్నికృష్ణ పిళ్లై(52), ఆయన భార్య బిందు(48) బలవన్మరణాకి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Dentist: కేరళలో ఓ పెషేంట్కి బాగున్న దంతాలను పీకేశాడు ఓ డెంటిస్ట్. చికిత్స చేయించుకునే సమయంలో 5 దంతాలను దెబ్బతీసినందుకు రూ. 5 లక్షలు జరిమానాగా కట్టాలని దంత వైద్యుడిని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ ఆదేశించింది. డెంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ షైనీ ఆంటోనీ రౌఫ్ వట్టుకులానికి చెందిన కే ఆర్ ఉషా కుమారికి పరిహారం చెల్లించాలని ఓ ప్రకటనలో కమీషన్ పేర్కొంది.
నిధుల కేటాయింపులో వివక్ష, నిర్లక్ష్యంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా కేరళ, తమిళనాడు తమ పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో కలిసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడు డీఎంకే గురువారం ఢిల్లీలో నిరసనలు చేపట్టనున్నాయి.
Kerala: కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆకలి బాధతో ఉన్న ఓ వ్యక్తి చనిపోయిన పిల్లిని పచ్చి మాంసం తిన్నాడు. ఈ ఘటనను చూసిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన ఉత్తర కేరళ జిల్లాలోని కుట్టిప్పురంలో జరిగింది. అస్సాంకు చెందిన ఓ వ్యక్తి రోజుల తరబడి ఆహారం లేక పిల్లి పచ్చి మాంసాన్ని తింటూ కనిపించాడు.