PM Modi: గగన్‌యాన్ మిషన్ కోసం ఎదురుచూస్తున్న భారత్‌కు ఇవాళ శుభవార్త అందింది. కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములను దేశానికి పరిచయం చేశారు. భారత వైమానిక దళానికి చెందిన ఈ వీరులు అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికయ్యారు. విశేషమేమిటంటే.. పలువురు అభ్యర్థులను పరిశీలించి.. చివరికి నలుగురు అభ్యర్థుల జాబితాను ఇస్రో సిద్ధం చేసింది.
Read Also: Mangalavaaram: మంగళవారం.. టీవీ లోనూ దుమ్మురేపింది
అయితే, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యోమగాములను వేదికపైకి పిలిచి ప్రపంచానికి పరిచయం చేశారు. గగన్‌యాన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికుల పేర్లు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. వైమానిక దళానికి చెందిన ఈ ధైర్యవంతులకు అన్ని రకాల యుద్ధ విమానాల గురించి తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Anil Ambani : రిలయన్స్ క్యాపిటల్ ను కొనుగోలు చేయనున్న హిందూజా గ్రూప్
అయితే, గగన్‌యాన్ ప్రాజెక్టు కింద భారత అంతరిక్ష సంస్థ సిబ్బందిని 400 కిలోమీటర్ల కక్ష్యలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మిషన్ ద్వారా వ్యోమగాములను మూడు రోజుల పాటు పంపి భూమిపై సురక్షితంగా దింపనుంది. ఇది, మొదటి మానవరహిత మిషన్ (G1 2024)గా నిలవనుంది. కాగా, గగన్‌యాన్ మిషన్‌పై ఆసక్తి కనబరిచిన టెస్ట్ పైలట్‌లలో, మొదటి దశ ఎంపికలో ఉత్తీర్ణత సాధించిన వారు కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. ఇది 2019 సంవత్సరంలో బెంగళూరులోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కింద పనిచేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్‌లో నిర్వహించబడింది. అనేక రౌండ్ల ఎంపిక ప్రక్రియ తర్వాత IAM నాలుగురి పేర్లను ఆమోదించింది. 2020 సంవత్సరంలో శిక్షణ కోసం ఇస్రో నలుగురిని రష్యాకు పంపింది. ఈ శిక్షణ 2021 సంవత్సరంలో ముగిసింది. కానీ, కోవిడ్-19 కారణంగా శిక్షణ పూర్తి కావడానికి సమయం పట్టిందని చెప్పుకొచ్చారు.