తమిళ్ రాకర్స్ భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన పైరేట్ వెబ్సైట్లలో ఒకటి. చాలా సినిమాల పైరసీ ప్రింట్లు విడుదల రోజునే తమిళ్ రాకర్స్లో వచ్చాయి. ఈ పైరేట్ వెబ్సైట్ కారణంగా అనేక సినిమాలు ఆర్థిక నష్టాలను చవిచూశాయి. ఇంతలో ధనుష్ హీరోగా తాజాగా విడుదలైన రాయన్ పైరేటెడ్ వెర్షన్ను అప్లోడ్ చేస్తూ మధురైకి చెందిన జెబ్ స్టీఫెన్ రాజ్ పట్టుబడ్డాడు.
Rashmika Mandanna: రష్మిక మందాన.. ఈ పేరు కంటే నేషనల్ క్రష్ అని చెబితే చాలామంది త్వరగా గుర్తుపడతారు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో తానేంటో నిరూపించుకుంది ఈ భామ. ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్ రన్ బీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాతో కుర్ర కారుకు నిద్రలేకుండా చేసింది. ఇకపోతే రష్మిక సినిమా పరంగా మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎంతో చలాకీగా, యాక్టివ్ గా ఉంటూ అందర్నీ సంతోషంగా ఉంచుతుంది.…
Supreme Court: కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. గవర్నర్ల దగ్గర పలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కాయి.
Brain eating amoeba: అత్యంత ప్రాణాంతకమైన ‘‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’’ నుంచి కేరళకు చెందిన 14 ఏళ్ల బాలుడు బయటపడ్డాడు. అమీబా వల్ల కలిగి ‘‘మెనింగోఎన్సెఫాలిటిస్’’ నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
AI Notes Writing: సాంకేతికత విస్తృతంగా ప్రస్తుతం చాలా చోట్ల AI టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపయోగించి వివిధ కొత్త సాఫ్ట్వేర్, యంత్రాలు మార్కెట్ లోకి వస్తున్నాయి. చదువుకునే విద్యార్థులు కూడా టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుని పరిశోధనలు చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారంతో సహా అనేక విషయాలలో AI విస్తృతంగా ఉపయోగించబడుతోంది. చదువుల కోసం పాఠశాలల్లో కూడా AI ఉపయోగించబడుతోంది. అయితే AIని వ్రాయడానికి ఎలా ఉపయోగించవచ్చు అనే విషయంపై ఒక వ్యక్తి కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. ఇందుకు…
జూలై 13న అదృశ్యమైన పారిశుధ్య కార్మికుడి మృతదేహం కేరళ రాజధాని తిరువనంతపురంలోని కాలువలో సోమవారం ఉదయం లభ్యమైంది. శనివారం రోజున అమైజాంచన్ కాలువను శుభ్రం చేస్తుండగా పారిశుధ్య కార్మికుడు జాయ్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నావికాదళం, స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సోమవారం ఉదయం అతడి కోసం గాలింపు చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్, అస్సాం, మహారాష్ట్రల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
Kerala : కేరళలో మరో చిన్నారికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ సోకింది. శనివారం పయోలి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన 14 ఏళ్ల చిన్నారికి జరిపిన టెస్టుల్లో ఇది తేలింది. కేరళలో ఇది నాలుగో కేసు. ముగ్గురు చిన్నారులు అప్పటికే చనిపోయారు.
Brain-Eating Amoeba: కేరళ రాష్ట్రాన్ని అరుదైన ప్రాణాంతక ‘‘మెదడును తినే అమీబా’’ ఇన్ఫెక్షన్ భయపెడుతోంది. కలుషిత నీటిలో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఈ అమీబా ముక్కు ద్వారా మానవ శరీరంలోకి చేరి చివరకు ప్రాణాలను తీస్తుంది. నేగ్లేరియా ఫౌలేరీ అనే అమీబా వల్ల ‘‘అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’’ అనే ఇన్ఫెక్షన్ సోకుతుంది.