Wayanad Landslide: ప్రకృతి అందాలకు నెలవైన కేరళ ఇప్పుడు వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనతో మృతుల దిబ్బగా మారింది. జిల్లాలోని ముండక్కై, చూరల్మల ప్రాంతాల్లో ల్యాండ్ స్లైండింగ్ మూలంగా విపత్తు సంభవించింది. మరణాల సంఖ్య 200ని దాటింది. టీ తోటల్లో పనిచేసే 600 మందికి పైగా కార్మికుల జాడ తెలియడం లేదు. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ కార్యక్రమాలు చేపడుతున్నారు.
కేరళలోని వయనాడ్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 204కి చేరింది. అలాగే.. 31 మంది తమిళనాడు చెందిన వారు మిస్సింగ్ కాగా.. 1592 మందిని రెస్క్యూ టీం కాపాడింది. మరోవైపు.. మట్టి కింద మానవ ఉనికిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అత్యంత వేగంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే.. ఈ ప్రకృతి విధ్వంసం జరిగిన సమయంలో ఓ వ్యక్తి తన కళ్లతో చూసిన విషయాలను తెలిపాడు.
కేరళ విలయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడగానికి వారం రోజుల ముందే కేరళలోని పినరయ విజయన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు.
Wayanad Landslides : నిరంతర భారీ వర్షాల తర్వాత కేరళలోని వాయనాడ్‌లో అతిపెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. జులై 30 ఉదయం ప్రజలు తమ ఇళ్లలో ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Wayanad Landslides : భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం కేరళలోని వాయనాడ్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించే ఘోర ప్రమాదాలలో మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
కేరళలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 122 మంది చనిపోయారు. అలాగే 142 తీవ్రగాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం అధికారులు కాపాడారు.
వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకూ 88 మంది చనిపోయారు. అలాగే వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరికొంత మందిని అధికారులు తీవ్రంగా శ్రమించి రక్షించారు. ఇప్పటికీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల కింద మృతదేహాలు కనిపిస్తుండటంతో.. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం కేరళ ప్రభుత్వానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు.