ప్రకృతి విలయంతో కేరళ అతలాకుతలం అయిన సంగతి చూస్తూనే ఉన్నాం, ముఖ్యంగా వయనాడ్‌లో వరదల దాటికి కొండ చరియలు విరిగిపది వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు. వయనాడ్ వరద భాదితుల సహాయార్థం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ హీరో సూర్య, జ్యోతిక, హీరో కార్తీ వయనాడ్ వరద బాధితులకు తమవంతుగా 50 లక్షల రూపాయల నగదును సాయంగా అందించారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆసియన్ సునీల్ నారంగ్, భాగస్వామ్యంలో మల్టీ ప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. విశాఖలో ప్రతిష్టాత్మక ఇనార్బిట్ మాల్ నిర్మాణం మొదలై చాలా కాలమైంది. ఈ మాల్ లో అల్లు అర్జున్, ఏషియన్ ల ‘AAA’ మల్టీప్లెక్స్ రాబోతుంది. ఆరు లేదా ఏడు స్క్రీన్ లు ఏర్పాటు చేసేలా ఇంటీరియర్ డిజైన్ ను ప్లాన్ రెడీ చేస్తున్నారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ ‘AAA’ మల్టీప్లెక్స్ లో బన్నీ, ఏషియన్ సునీల్ ఇది వరకే భాగస్వామ్యులుగా ఉన్న సంగతి విదితమే.
Also Read: Prabhas: కల్కి OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
తారక్, కొరటాల శివ కాంబోలో వస్తున్న తాజా చిత్రం దేవర. ఇటీవల ఈ చిత్రం సెకండ్ సింగిల్ అప్ డేట్ ఎప్పుడు ఇస్తారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సెకండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ ఈ రోజు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పాట కూడా ఈ నెల 3 న విడుదల చేసే అవకాశం ఉండొచ్చని యూనిట్ సభ్యుల టాక్.