కేరళలోని కోజికోడ్‌లో ఓ ఆశ్చర్యకరమైన క్రియేటివిటీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక్కడ ఒక వ్యక్తి తన ఇంటి కంఫౌండ్ గోడలను పూర్తి రైలులా కనిపించే విధంగా ప్రత్యేకమైన డిజైన్‌గా మార్చాడు.
Pappachan murder: కేరళలో పాపచ్చన్ అనే 82 ఏళ్ల వృద్ధుడి హత్య కేసు సంచలనంగా మారింది. ఈ కేసు క్రైమ్ థ్రిల్లర్‌ని తలపిస్తోంది. దురాశ, నమ్మక ద్రోహంతో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహిళా ఈ క్రూరమైన ప్లాన్‌కి స్కెచ్ వేసింది. ముందుగా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన గ్యాంగ్, సీసీకెమెరాలను పరిశీలించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రకృతి విలయంతో వయనాడ్ కకావికలం అయింది. ఊహించని విపత్తుతో ఆప్తుల్ని కోల్పోవడంతో పాటు ఆస్తుల్ని పోగొట్టుకుని దు:ఖ సముద్రంలో ఉన్న బాధితులకు ప్రధాని మోడీ అండగా నిలిచారు. వారి కష్టాలను, బాధలను తెలుసుకుని చలించిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
PM Modi on Wayanad: కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తుతో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా.. మరో 200 మంది ఆచూకీ గల్లంతైంది.
PM Modi: ప్రకృతి అందాలకు నెలవైన కేరళలోని వయనాడ్ ప్రాంతం , కొండచరియలు విరిగిపడిన సంఘటనతో మృతుల దిబ్బగా మారింది. ఈ ప్రమాదంలో 400కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ రేపు వయనాడ్‌లో పర్యటించనున్నారు. సహాయక పునారావాస చర్యల్ని సమీక్షించేందుకు పీఎం వయనాడ్ వెళ్తున్నారు.
CM Pinarayi Vijayan: వయనాడ్ విషాదానికి అక్రమ మైనింగ్, అనుమతి లేని మానవ నివాసాలే కారణమంటూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చేసిన కామెంట్స్ పై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగావారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఊహించని ఈ పరిణామం దేశప్రజలను త్రీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. వయనాడ్ భాదితులకు సాయం చేసేందుకు సినీతారలు తమ వంతుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి రూ. 50లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు. Also Read : Pawan Kalyan: పవన్ బర్త్ డే కానుకగా సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న’OG’…
Brain Eating Amoeba In Kerala: కేరళలోని తిరువనంతపురంలో మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్) తో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులను వైద్యులు నిర్ధారించారు. బాధితులు ముగ్గురూ చెరువులో స్నానం చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకింది. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ విషయంపై సమాచారం ఇస్తూ.. ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ముగ్గురూ తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. కేరళ ప్రభుత్వం చెరువు నీటిని వినియోగించుకునే వారికి కూడా…
కేరళ వయనాడ్ విషాదానికి కారణం గజరాజుల శాపమేనా? ఏనుగుల శాపమే కొండచరియలు విరిగి పడి గ్రామాలకు గ్రామాలకు తుడిచిపెట్టుకొని పోయాలే చేశాయా? ఈ అంశాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య 308కి చేరింది. ఇప్పటికీ చాలా మంది శిథిలాల కింద కూరుకుపోయినట్లు అంచనా. తప్పిపోయిన వారిని అన్వేషించేందుకు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది.