వయనాడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 287 కి చేరింది. ప్రస్తుతం రెస్క్యూ అపరేషన్స్ కొనసాగుతోంది. సీఎం విజయన్ ఎరియల్ సర్వే చేపట్టారు. సహాయక చర్యలకు వర్షం అడ్డంకులు చోటుచేసుకుంటున్నాయి. బురదలో కూరుకు పోయిన మృతి చెందిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వందల మంది ఆచూకి గల్లంతైంది. కేరళ సీఎం మేజర్ జనరల్ ఇంద్రబాలన్ సహయం తీసుకుంటామని తెలిపారు.
READ MORE: Paris Olympics 2024: పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు భారీగా నగదు..!
వరదలో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో నిరాశ్రయులైన వారికి చూరల్ మల ఎగువన ముండక్కై లో వెయ్యిమందికి పైగా ఆవాసం కల్పించారు. చరల్ మల నుంచి ముండక్కై వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో ఆర్మీ తాత్కాలిక వంతెన నిర్మిస్తోంది.
READ MORE: NTR Bharosa Pensions: రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ.. 2.30 గంటల్లోనే..!
కాగా.. మండకై ప్రాంతంలోని టీ, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు బెంగాల్, అసోం నుంచి వందలాది మంది కార్మికులు వచ్చారు. వీరిలో 600 మంది ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు. వీరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళలో మరో 2, 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. వయనాడు జిల్లాలో వర్షం కురుస్తోంది. మరో 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు కేరళ సర్కార్ 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. నిన్న తిరువనంతపురంలో అసెంబ్లీలో జాతీయ జెండాను సగం వరకు ఎగరేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు వయనాడ్ మృతులకు సంతాపం తెలిపారు.