కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మసాలా బాండ్ కేసులో పినరయి విజయన్‌కు, మాజీ మంత్రి ఇస్సాక్‌కు ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
వయనాడ్ బాధితుల కోసం చీటింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ భారీ సాయం ప్రకటించాడు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తన విరాళంగా రూ. 15 కోట్లను అంగీకరించాల్సిందిగా కేరళ సీఎం పినరయి విజయన్‌కు చంద్రశేఖర్ లేఖ రాశారు. అంతేకాకుండా బాధితులకు తక్షణ ప్రాతిపదికన 300 ఇళ్ళు నిర్మించడానికి మరింత సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సుకేష్ తన లేఖలో పేర్కొన్నాడు.
Priyanka Gandhi : 2024 లోక్‌సభ ఎన్నికల రెండవ దశ ప్రచార సందడి తగ్గింది. ఏప్రిల్ 26న కేరళలోని వాయనాడ్‌తో సహా 88 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఇండియా కూటమిలో స్నేహబంధం మరోసారి సడలినట్లు కనిపిస్తోంది.
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Kerala : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సోమవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు గుప్పించారు. తనను శారీరకంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
విశ్వవిద్యాలయాల వీసీల నియమకాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.