Water Metro: దేశంలోనే తొలి వాటర్ మెట్రో.. రేపే ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India First Water Metro To Be Inaugurated In Kochi On April 25: ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎన్నో రవాణా మార్గాలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్‌ని అదుపు చేసేందుకు.. ఇప్పటికే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా వాటర్ మెట్రో సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. కేరళలోని కొచ్చిలో ఈ వాటర్ మెట్రోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 25వ తేదీన ప్రారంభించనున్నారు. ఇది దేశంలోనే తొలి వాటర్ మెట్రో. కేరళ ప్రభుత్వం కొచ్చి వాటర్ మెట్రో పేరుతో నీటిపై నడిచే ఈ మెట్రో సర్వీస్‌ను అందుబాటులోకి తెస్తోంది.
Sai Dharam Tej: ఏం మెగా మేనల్లుడు గారు.. చిన్న మామపై సెటైర్ వేస్తున్నారు
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
కోచి మెట్రో రైల్ లిమిటెడ్ ఈ వాటర్ మెట్రో నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ఈ మెట్రో సర్వీస్‌లో బ్యాటరీ సాయంతో నడిచే మొత్తం 78 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లు అందుబాటులో ఉంటాయి. వీటి కోసం 38 టెర్మినల్స్ నిర్మించారు. కోచి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ.. ఈ వాటర్ మెట్రో రాకపోకలను సాగిస్తుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ(KfW) సంయుక్తంగా కలిసి.. ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్‌ను రూ.1,136.83 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది పూర్తిగా విద్యుత్ సహాయంతో పని చేస్తుంది. ఇందులో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశారు. ప్రస్తుతానికైతే.. రోజూ 12 గంటల పాటు ఈ మెట్రో సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఓడల్లో ఏసీ, వైఫై సౌకర్యాలూ ఉన్నాయి.
Round The World Cruise: ప్రయాణికుడ్ని వదిలి క్రూజ్ షిప్ జంప్.. 17 లక్షలు స్వాహా
ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి కనిష్ఠంగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రారంభ ధర రూ.20 కాగా.. గరిష్ట టికెట్ ధర రూ.40 గా కేటాయించారు. అంతేకాదు.. పాస్‌ల సౌకర్యాన్ని కూడా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చింది. వారం రోజుల పాస్ ఖరీదు రూ.180 గానూ, నెలవారీ పాస్ ధర రూ.600 గానూ, మూడు నెలల పాస్ ఖరీదు రూ.1500 గానూ నిర్ణయించారు. దక్షిణాసియాలోనే తొలి వాటర్ మెట్రో ఇదేనని, దీని ద్వారా కోచి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. దశల వారీగా ఈ సర్వీసుల సంఖ్య పెంచనున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!